Game Changer: ‘గేమ్ ఛేంజర్’ అవుట్ ఫుట్ పై డైరెక్టర్ శంకర్ షాకింగ్ కామెంట్స్, ఫ్యాన్స్ అసహనం!
Shankar Comments on Game Changer Output: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న థియేటర్లోకి వచ్చింది. మొదటి నుంచి మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మూడేళ్ల క్రితమే షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా ఈ ఏడాది థియేటర్లోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా టాక్ అందుకుంది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని ఆశపడ్డ బెగా అభిమానులు నిరాశ పరిచింది.
డివైడ్ టాక్ తెచ్చుకున్న గేమ్ ఛేంజర్ పై రిజల్ట్ పై తాజాగా డైరెక్టర్ శంకర్ స్పందించారు. ఈ సందర్భంగా మూవీపై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ అవుట్ పుట్ తో తాను సంతృప్తిగా లేనన్నారు. ‘నేను అనుకున్న ప్రకారం ఈ సినిమా 5 గంటల నిడివి వరకు ఉండాలి. కానీ, సమయాభావం వల్ల కొన్ని సీన్స్ కట్ చేయాల్సి వచ్చింది. దాని వల్ల కథ అనుకున్న విధంగా రాలేదు. గేమ్ ఛేంజర్ తో నేను చెప్పాలనుకుంది చెప్పలేకపోయా’ అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే గేమ్ ఛేంజర్ కి రామ్ చరణ్, ఎస్ జే సూర్యల నటనే బలం అన్నారు. వారి యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత ఇంతవరకు ఆన్ లైన్ రివ్యూలు తాను చూడలేదన్నారు. తనకు తెలిసినంత వరకు వరకు గేమ్ ఛేంజర్ కు మంచి రివ్యూలు వచ్చినట్టు విన్నాను అన్నారు. దీంతో ఆయన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఓ దర్శకుడిగా సినిమా రిలీజ్ తర్వాత టాక్ ఎలా ఉంది, రివ్యూలు ఎలా వచ్చాయనేది కనీసం తెలుసుకోవాల్సిన అంశమని, అలాంటిది ఆన్ లైన్ రివ్యూస్ చూడలేదనడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు రివ్యూలు చూడకుండ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ జనరేషన్ ఆలోచనలు ఎలా తెలుస్తాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.