Last Updated:

Flipkart Republic Day Sale: నిజమైన డీల్స్.. ఐఫోన్లపై వేలల్లో డిస్కౌంట్లు.. పండగ చేస్కోండి..!

Flipkart Republic Day Sale: నిజమైన డీల్స్.. ఐఫోన్లపై వేలల్లో డిస్కౌంట్లు.. పండగ చేస్కోండి..!

Flipkart Republic Day Sale: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ లైవ్ అవుతుంది. సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్లతో సహా అనేక ఉత్పత్తులపై బంపర్ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అలానే ఈ సేల్‌లో ఐఫోన్‌లు అతి తక్కువ ధరకు లభిస్తాయి. ఇప్పుడు మీరు ఐఫోన్ 15 కొనాలంటే ఒకసారి దానిపై ఉన్న డీల్స్ చెక్ చేయండి. ఇది మాత్రమే కాదు, మీరు ప్రో మోడల్‌ను కొనుగోలు చేయాలనుకుంటే దీని కోసం మీరు ఆఫ్‌లైన్‌లో విజయ్ సేల్స్‌పై ఆఫర్‌లను చూడండి. iPhone 15 సిరీస్‌లో అందుబాటులో ఉన్న ఉత్తమ ఆఫర్‌ల గురించి తెలుసుకుందాం.

iPhone 15
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ప్రస్తుతం ఐఫోన్ 15పై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ని 2023లో రూ. 79,900కి లాంచ్ చేసింది కానీ ఇప్పుడు మీరు కేవలం రూ. 58,999తో ఈ ఫోన్‌ని మీ సొంతం చేసుకోవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఎంపికతో పాటు, ఫోన్‌పై అదనంగా రూ. 1500 తగ్గింపు లభిస్తుంది. ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో మీరు రూ. 25,000 వరకు తగ్గింపు పొందచ్చు, ఇది ఫోన్ ధరను గణనీయంగా తగ్గిస్తుంది. అయితే మీరు iPhone 13పై ఈ ఎక్స్‌ఛేంజ్ డీల్‌ని పొందచ్చు.

iPhone 15 Plus
సిరీస్ ఈ ప్లస్ వేరియంట్‌పై కూడా పెద్ద తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ని 2023లో రూ. 89,900కి లాంచ్ చేసింది కానీ ఇప్పుడు మీరు కేవలం రూ. 66,999తో ఈ ఫోన్‌ని మీ సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఫోన్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఎంపికతో రూ. 1500 అదనపు తగ్గింపును కూడా పొందుతోంది. ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో, మీరు రూ.28 వేల వరకు తగ్గింపు పొంవచ్చు, ఇది ఫోన్ ధరను గణనీయంగా తగ్గిస్తుంది. అయితే మీరు iPhone 13 ఎక్స్‌ఛేంజ్‌పై ఈ  విలువను పొందుతారు.

iPhone 15 Pro, Pro MAX
ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్‌పై పెద్ద డిస్కౌంట్లను అందించడం లేదు కానీ మీరు ఈ రెండు స్మార్ట్‌ఫోన్లపై విజయ్ సేల్స్ నుండి చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 15 ప్రో ప్రస్తుతం ఎలాంటి ఆఫర్ లేకుండా కేవలం రూ. 1,02,190కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌లతో మీరు స్మార్ట్‌ఫోన్‌పై రూ. 10,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్ IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఎంపికపై అందుబాటులో ఉంటుంది. కాగా, Pro MAX కేవలం రూ. 1,21,000కే అందుబాటులో ఉంది.