Last Updated:

Samantha: అనారోగ్యం బారిన పడిన సమంత – ఇందులోనూ ఫన్‌ ఉందంటూ పోస్ట్‌

Samantha: అనారోగ్యం బారిన పడిన సమంత – ఇందులోనూ ఫన్‌ ఉందంటూ పోస్ట్‌

Samanth About Her Health: స్టార్‌ హీరోయిన్‌ సమంత ఇటీవల సిటాడెల్: హనీ బన్నీ వెబ్‌ సిరీస్‌తో నటించింది. అమెజాన్‌ ప్రైం వీడియోలో విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌ మంచి విజయం సాధించింది. మొన్నటి వరకు తన వెబ్‌ సరీస్‌ సిటాడెల్‌ ప్రమోషనల్‌ కార్యక్రమంలో సందడి చేసిన ఆమె ఈ మధ్య సైలెంట్‌ అయ్యింది. సోషల్‌ మీడియాలోనూ పెద్దగా కనిపించడం లేదు. అయితే తాజాగా ఇందుకు కారణం చెప్పింది సామ్‌. తాజాగా వీడియో షేర్‌ చేస్తూ తాను అనారోగ్యం బారిన పడినట్టు చెప్పింది.

ఇటీవల తాను చికున్‌ గున్యా బారిన పడ్డానని, ప్రస్తుతం కోలుకున్నట్టు చెప్పింది. చికున్‌ గున్యా నుంచి కోలుకున్న ఆమె జిమ్‌ వ్యాయమం చేస్తున్న వీడియో షేర్‌ చేసింది. తన స్టోరీ వీడియో షేర్‌ చేస్తూ.. ‘చికున్‌ గున్యా వల్ల వచ్చిన కీళ్లనొప్పుల నుంచి కోలుకోవడంలోనూ చాలా ఫన్‌ ఉంది’ అని బాధతో ఉన్న ఎమోజీలను పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ఆకాక్షిస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: