Last Updated:

Game Changer Collections: సర్‌ప్రైజ్‌ చేస్తున్న గేమ్‌ ఛేంజర్‌ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ – ఎంతంటే..

Game Changer Collections: సర్‌ప్రైజ్‌ చేస్తున్న గేమ్‌ ఛేంజర్‌ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ – ఎంతంటే..

Game Changer Box Office Collections: గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటించని లేటెస్ట్‌ మూవీ ‘గేమ్‌ ఛేంజర్‌’ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు, శిరీష్‌లు నిర్మించారు. ఇందులో చరణ్‌ త్రీ షేడ్స్‌లో కనిపించారు. ఇందులో ఆయన చేసిన అప్పన్న పాత్ర ఆడియన్స్‌ బాగా ఆకట్టుకుంది. చరణ్‌ అప్పన్న పాత్రలో జీవించాడనే చెప్పాలి. ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత చరణ్‌ నటించిన చిత్రమిది.

ఆరేళ్ల తర్వాత సోలోగా వచ్చిన ఈ మూవీపై భారీ అంచనాల నెలకొన్నాయి. ఎన్నో అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌డే కలెక్షన్స్‌ చిత్ర బ్రందం తాజాగా వెల్లడించింది. తొలి రోజు దేశవ్యాప్తంగా గేమ్‌ ఛేంజర్‌ రూ. 186పైగా కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసినట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది. తొలి రోజు గేమ్‌ ఛేంజర్‌ బ్లాక్‌బస్టర్‌ ఒపెనింగ్‌ ఇచ్చిందంటూ మూవీ టీం ఆనందం వ్యక్తం చేసింది. ఈ కలెక్షన్స్‌ చూసి మెగా ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెగా ఒపెనింగ్‌ అంటూ మురిసిపోతున్నారు.

ఇదిలా ఉంటే గేమ్‌ ఛేంజర్‌ కొన్ని చోట్ల మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఫస్టాఫ్‌ బోర్‌ కొట్టించిందని, అయితే ఇంటర్వేల్‌ సీన్‌లో వచ్చిన ట్విస్ట్‌ అదిరిపోయిందారు. గేమ్‌ ఛేంజర్‌ చరణ్‌ తన భుజాన నడిపించాడంటూ రివ్యూస్‌ వచ్చాయి. అయితే రోటిన్‌ కథ, కథనం.. ఎమోషన్స్‌ కొరవడంతో మూవీ ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేదంటూ రివ్యూస్‌ వచ్చాయి. కానీ టాక్‌ భిన్నంగా వచ్చిన మూవీ కలెక్షన్స్‌ చూస్తుంటే ఈ వీకెండ్‌ కూడా మంచి వసూళ్లు రాబట్టేలా ఉందంటున్నారు ట్రేడ్‌వర్గాలు.