Last Updated:

Deputy CM Pawan Kalyan: విశాఖకు చేరుకున్న పవన్ కల్యాణ్..ఘన స్వాగతం

Deputy CM Pawan Kalyan: విశాఖకు చేరుకున్న పవన్ కల్యాణ్..ఘన స్వాగతం

Andhra Pradesh Deputy CM Pawan Kalyan Reached Vishaka: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, జనసేన నేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ కల్యాణ్ ఎయిర్ పోర్టు నుంచి నోవాటెల్ హోటల్‌కు బయలుదేరారు.

కాగా, సాయంత్రం ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ స్వాగతం పలకనున్నారు. అనంతరం ప్రధాని మోదీతో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు. అక్కడనుంచి భారీగా నిర్వహించే సభలో పవన్ పాల్గొంటారు. ఈ భారీ బహిరంగ సభ ముగిసిన అనంతరం రాత్రి 7.25 గంటలకు పవన్ కల్యాణ్ తిరిగి గన్నవరం ఎయిర్ పోర్టుకు బయలుదేరనున్నారు. అక్కడినుంచి తన నివాసానికి వెళ్లనున్నారు.

ఇదిలా ఉండగా, విశాఖపట్నంలో రూ.2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా రైల్వే జోన్, పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్ తదితర అభివృద్ధి కార్యాక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.