Nayanthara: మరో వివాదంలో చిక్కున్న నయనతార – రూ. 5 కోట్ల నష్టపరిహారం కింద నోటీసులు
Nayanthara Gets Notice From Makers: హీరోయిన్ నయనతార మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే తన డాక్యుమెంటరీ వ్యవహరంలో ధనుష్ ఆమెకు నోటీసులు ఇచ్చాడు. తన అనుమతి లేకుండ నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని క్లిప్ వాడటంతోపై ఆ సినిమా నిర్మాతగా వ్యవహరించిన ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే ఇప్పుడు ధనుష్ తరహాలోనే చంద్రముఖి మూవీ నిర్మాతలు నయన్‌కు నోటీసులు ఇచ్చారు.
తమ అనుమతి లేకుండా చంద్రముఖి సినిమాలోని సన్నివేశాలను తన డాక్యుమెంటరీలో వాడుకున్నందుకు నిర్మాతలు నయనతారకు నోటీసులు పంపారు. కాపీ రైట్ కింద ఓటీటీ ప్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్, హీరోయిన్ నయనతార రూ. 5 కోట్లు చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికీ ధనుష్‌తో వివాదం హాట్‌టాపిక్‌గా ఉన్న క్రమంలో నయనతారపై మరో కాపీ రైట్ దావా పడటంతో గమనార్హం. మరి ఈ నోటీసలు నయన్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిని సంతరించుకుంది.
అసలేం జరిగిందంటే..
నయనతార జీవితంపై నెట్‌ఫ్లిక్స్ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ పేరుతో డాక్యుమెంటరీ తెరకెక్కించింది. ఇండస్ట్రీలో ఆమె ఎదుర్కొన్న పరిణామాలు, ఒడిదుడుకుల, హిట్స్, ప్లాప్స్తో పాటు లవ్, బ్రేకప్ వంటి అంశాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తన సినీ కెరీర్ కీలకంగా ఉన్న పలు చిత్రాల క్లిప్స్‌ను ఈ డాక్యుమెంటరీ వాడారు. ఇందులో తన భర్త విఘ్నేష్ శివన్‌తో పరిచయం, ప్రేమకు బీజం పడేలా చేసిన నానుమ్ రౌడీ దాన్ (నేనూ రౌడీనే) సినిమాలోని మూడు సెకన్ల సన్నివేశాన్ని ఇందులో పొందుపరిచారు.
ఈ సినిమాకు హీరో ధనుష్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ క్లిప్‌ను తన అనుమతి లేకుండ వాడారు అని ఆరోపిస్తూ ధనుష్ నయన్ దంపతులకు నోటీసులు ఇచ్చాడు. నష్ట పరిహారం కింద రూ. 10 కోట్లు డిమాండ్ చేశాడు. ధనుష్ నోటీసలు నయన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తండ్రి, అన్నయ్య అండతో ధనుష్ ఎదిగాడు. నేను ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండ ఈ స్థాయికి చేరుకున్నాను. అది ఓర్వలేక ధనుష్ ఇలా నోటీసులు పంపారని, మూడు సెకన్ల క్లిప్ వాడినందుకు నష్టపరిహారంగా పది కోట్లు అడగడం కరెక్ట్ కాదంటూ ధనుష్‌ను విమర్శిస్తూ సుధీర్ఘ పోస్ట్ షేర్ చేసింది.
అంతేకాదు ధనుష్ స్టేజ్ ఎక్కితే నితిమంతుడిలా మాట్లాడతాడని, కానీ నిజానికి అది ఆయన స్వభావం కాదని పేర్కొంది. బయటి ప్రపంచానికి తెలిసి ధనుష్, వ్యక్తిగతంగా ఉండే ధనుష్ వేరు అని, అతడి నిజస్వరూపం బయట పడకుండ జాగ్రత్త పడుతున్నాడని తీవ్ర విమర్శలు చేసింది. దీంతో వీరిద్దరి వివాదం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. వీరిద్దర మధ్య వివాదం మద్రాస్ హైకోర్టు వరకు చేరింది. ఒకప్పుడు మంచి స్నేహితులైన ధనుష్, నయనతారలు మధ్య ఈ వివాదం ఎప్పటి సద్దుమణుగుతుందో చూడాలి.