Last Updated:

Manchu Vishnu: అల్లు అర్జున్‌ వివాదం – ‘మా’ సభ్యులకు మంచు విష్ణు కీలక సూచన

Manchu Vishnu: అల్లు అర్జున్‌ వివాదం – ‘మా’ సభ్యులకు మంచు విష్ణు కీలక సూచన

Manchu Vishnu Statement to MAA Members: సంధ్య థియేటర్‌ ఘటన, సినీ హీరో అల్లు అర్జున్‌ అరెస్ట్‌ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా ఓ ప్రకటన చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ‘మా’ సభ్యులకు ఓ కీలక సూచన చేశారు. సున్నితమైన విషయాలపై ఎవరూ స్పందించకపోవడం మంచిదన్ని అన్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.

కొన్ని రోజులుగా అల్లు అర్జున్‌ వివాదం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వ్యవహరంలో టాలీవుడ్‌ తీరుపై సీఎం రేవంత్‌ రెడ్డి అసహనం చూపించారు. ముఖ్యంగా సంధ్య థియేటర్‌ ఘటన అల్లు అర్జున్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు ఓ ప్రకటన చేశారు. “మన కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజాప్రతినిధులతో అనుబంధం, సాన్నిహిత్య సంబంధాలతో కలిగి ఉంటుంది. సహకారం, సృజనాత్మకతపై ఆధారపడి నడిచేది మన చిత్ర పరిశ్రమ.

గతంలో వివిధ ప్రభుత్వాల మద్దతు వల్ల మన పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందింది. ప్రత్యేకంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్‌లో స్థిరపడటానికి ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అందించిన ప్రోత్సామం అత్యంత ముఖ్యమైనది. నాడు మొదలుకొని, ప్రతి ప్రభుత్వంతో మన పరిశ్రమకు ఎల్లప్పుడూ సత్సంబంధాలు కానసాగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని సభ్యులందరూ సున్నితమైన విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించడం గానీ, వివాదస్పద అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం గాని నివారించండి.

కొన్ని సమస్యలు వ్యక్తిగతమైనవి, మరికొన్ని విషాదకరమైనవి వాటిపై చట్టం తన దారిలోన న్యాయం చేస్తుంది. అలాంఇ అంశాలపై మాట్లాడటం వల్ల అది సమస్యలను పరిష్కరించడానికి బదులుగా, సంబంధిత పక్షాలకు మరింత నష్టం చేస్తుంది. ఈ సమయంలో మనకి సహనం, సానుభూతి, సంఘ ఐక్యత అవసరం. తెలుగు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఓ పెద్ద కుటుంబం అని సంగతి గుర్తించుకుందాం. ఎలాంటి సమస్యలు వచ్చినా. మనమంతా కలిసి అవన్నీ ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాను” అంటూ విష్ణు పత్రిక ప్రకటన విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి: