Mythri Movie Makers: సంధ్య థియేటర్ ఘటన – బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ ఆర్థిక సాయం
Pushpa 2 Makers Helps Sritej Family: సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను పుష్ప 2 నిర్మాతలు నవీన్ యర్నేని, రవిశంకర్‌లు యలమంచిలి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వారితో పాటు సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. సోమవారం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇచ్చారు. అనంతరం రూ. 50 లక్షల చెక్కును అందజేశారు.
కాగా పుష్ప 2 మూవీ రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 4న సంధ్య థియేటర్‌లో బెనిఫిట్ షో వేశారు. ఈ సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్‌కి వెళ్లడంతో అభిమానులంతా ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో థియేటర్లో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ సంఘటనలో సినిమా రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. దీంతో భగవంతుడి దయ వల్ల శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నారు.
దయచేసి దీన్ని రాజకీయం చేయకండి: మంత్రి
ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ఇష్యూ రాజకీయం చేయొద్దని అన్నారు. ఇక సినీ పరిశ్రమ ఎక్కడికి వెళ్లదని, ఈ సమయంలో రూమర్స్ క్రియేట్ చేయొద్దన్నారు. అలాగే సినీ హీరోల ఇళ్లపై దాడులు చేయవద్దని ఆయన కోరారు. ఇక బాబు పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందన్నారు. దేవుడి దయవల్ల త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు.