Last Updated:

Mohan Babu: మోహన్‌ బాబుకు హైకోర్టులో చుక్కెదురు – అరెస్ట్ తప్పదా?

Mohan Babu: మోహన్‌ బాబుకు హైకోర్టులో చుక్కెదురు – అరెస్ట్ తప్పదా?

High Court Shock to Mohan Babu: సినీ నటుడు మోహన్‌ బాబుకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. విలేఖరి దాడి ఘటనలో ఆయన వేసిన ముందస్తు బెయిల్‌ పటిషన్‌ నేడు కోర్టులో విచారణకు రాగా.. ఆయన పటిషన్‌ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ నెల 10న మోహన్‌ బాబు జల్‌పల్లి నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తమ కుటుంబ గొడవలు రచ్చకెక్కడంతో ఆయన కుమారుడు మనోజ్‌ జల్‌పల్లి ఇంటి ముందు ధర్నా చేపట్టాడు. ఆయన మద్దతుగా మీడియాకు అక్కడికి పిలుపించుకున్నాడు.

ఈ క్రమంలో ఇంటి సమస్యపై ఓ రిపోర్టర్‌ ప్రశ్నించగా.. అతడిపై మైక్‌తో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు తనని అరెస్ట్‌ చేయకుండ మోహన్‌ బాబు హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తాజాగా ఆయన పటిషన్‌ కోర్టులో విచారణకు వచ్చింది. ప్రస్తుతం మోహన్‌ బాబు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాల్సిందిగా ఆయన తరపు న్యాయవ్యాదికి కోర్టును కోరారు. ఆయనకు బెయిల్‌ మంజూరు చేయొద్దని అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తన వాదనలు వినిపించారు.

ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు మోహన్‌ బాబు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా విలేఖరి దాడి ఘటన తర్వాత జర్నలిస్ట్‌ సంఘాలు ఆయనపై విరుచుకుబడ్డాయి. వెంటనే విలేఖరికి క్షమాపణలు చెప్పాలని భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ పరిణామాల మధ్య మోహన్‌ బాబు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. హైబీపీ, గుండె, నరాల సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ హస్పిటల్లో రెండు రోజుల పాటు చికిత్స పొందారు. డిశ్చార్జ్‌ అనంతరం తన మనవడిని చూసేందుకు దుబాయ్‌ వెళ్లారని, ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చిన ఆయన ప్రస్తుతం తిరుపతిలో ఉన్నట్టు మోహన్‌ బాబు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అక్కడ తన విద్యాసంస్థల వ్యవహారాలను చూసుకుంటున్నట్టు పేర్కొన్నారు.