AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. కేబినెట్ నిర్ణయాలివే!
AP Cabinet Meeting Concluded: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సుమారు 3 గంటలకుపై సమావేశం కొనసాగింది. ఈ మేరకు కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అమరావతిలోరూ.24,276కోట్ల అడ్మినిస్ట్రేషన్ పనులకు సంబంధించిన అనుమతులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇందులో భాగంగా రాజధాని నిర్మాణానికి హడ్కో నుంచి రూ.11వేల కోట్లు రుణం, కేఎఫ్‌డబ్ల్యూ ఆర్థిక సంస్థ నుంచి రూ.5వేల కోట్ల రుణాలు తీసుకునేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ పనులకు మళ్లీ టెండర్లు పిలిచే ప్రతిపాదన, హంద్రీనీవా సుజల స్రవంతి సెకండ్ ఫేస్ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్‌కు అనుమతులు ఇస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
అంతేకాకుండా వరదలకు నష్టపోయిన 10 జిల్లాలోని బాధితులకు రుణాలపై రీ షెడ్యూల్, రైతులకు రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయించే ప్రతిపాదనపై కూడా చర్చించారు. ఇంటర్ విద్యార్థులకు ఫ్రీ బుక్స్, మధ్యాహ్న భోజనానికి సంబంధించి నిధులపై చర్చించారు. మంగళగిరి ఎయిమ్స్‌కు అదనంగా మరో 10 ఎకరాల భూమి కేటాయింపుతోపాటు మార్క్ ఫెడ్ నుంచి రూ.1000కోట్లు రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.