Theatre/OTT Movies: ఈ వారం థియేటర్, ఓటీటీ సినిమాలివే
This Week Theatre and OTT Movies: ప్రతి శుక్రవారం థియేటర్‌లో రిలీజ్ అవుతుంటాయి. అలాగే ఓటీటీలోనూ కొత్త వెబ్ సిరీస్‌లు, సినిమాలు సందడి చేస్తుంటాయి. అయితే ఈ వారం థియేటర్లో చెప్పుకొదగ్గ సినిమాలేవి లేవు. రేపు శుక్రవారం సుమారు 10 సినిమాలు థియేటర్ రిలీజ్‌కు ఉన్నాయి. కానీ అందులో అల్లరి నరేష్ మారేడి మల్లి సినిమా మాత్రమే అందరిని దృష్టిని ఆకర్షిస్తుంది. దీంతో ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లపై ఆసక్తి నెలకొంది. అయితే ఈ వారం ఓటీటీలోకి లేటెస్ట్ హిట్ మూవీతో పాటు పలు కొత్త వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు రిలీజ్ కాబోతున్నాయి.
థియేటర్ సినిమాలు
బచ్చల మల్లి
‘అల్లరి’ నరేష్ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బచ్చల మల్లి’. రేపు (డిసెంబర్ 20) ఈ సినిమా థియేటర్‌లో విడుదల కానుంది. మొన్నటి వరకు కామెడీ కథలతో నవ్వించిన నరేష్ ఈ మధ్య సీరియస్ జానర్లు చేస్తూ హిట్స్ అందుకుంటున్నాడు. నాంది, ఇట్లు మారేడిమిల్లి, ఉగ్రం వంటి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టాడు. ఆ తర్వాత ఆ ఒక్కటి అడక్కు అంటూ కామెడీ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమా ఆశించిన రెస్పాన్స్ అందుకోలేదు. దీంతో మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి దిగి ‘బచ్చల మల్లి’ సినిమాతో రెడీ అయ్యాడు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేం సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ పతాకంపై బాలాజీ గుత్తా, రాజేష్ దండలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీ మంచి బజ్ క్రియేట్. మరి రేపు శుక్రవారం థియేటర్లో విడుదల కాబోతోన్న ఈ చిత్రం ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.
విడుదల 2
విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విడుదల’ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. తమిళ్, తెలుగులో విడుదలై మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘విడుదల 2’ రానుంది. రేపు డిసెంబర్ 20న తమిళ్, తెలుగు బాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో నిర్మాత చింతపల్లి రామారావు విడుదల చేస్తున్నారు. పరిపాలకుల అహంకారానికి అణచివేయబడిన సామాన్యుల నుంచి ఉధ్భవించిన ఒక అసామాన్యుడి వీర విప్లవ కథ విడుదల 2. యదార్థ సంఘటలన ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించాడు.
ముఫాసా: ది లయన్ కింగ్
ది లయన్ కింగ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది. 1994లో యాక్షన్ అడ్వెంచర్‌గా వచ్చిన ఈ మూవీని 2019లో అదే పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు భాషల్లో మరోసారి ప్రేక్షకులు అందించారు. అయితే ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ గా ‘ముఫాసా’ రాబోతుంది. అనాముకుడైన ముఫాస అనే సింహం పిల్ల అడవికి రాజుగా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమా కథ. ముఫాసా అసలు లయన్ కింగ్ ఎలా అయ్యాడన్న బ్యాక్ డ్రాప్ తో యాక్షన్, ఎమోషన్స్, అడ్వెంచర్ ..ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ తో ఈ సినిమా బారీ జెంకిన్స్ తెరకెక్కించారు. ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ అవుతుంది.
రేపు ఓటీటీ సినిమాలివే
ఆహా
జీబ్రా (తెలుగు క్రైం థ్రిల్లర్) – డిసెంబర్ 20
హాట్‌స్టార్
వాట్ ఇఫ్ సీజన్ 3 (మార్వెల్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 22
ఓ కమాన్ ఆల్ యే ఫెయిత్‌ఫుల్ (ఇంగ్లీస్)- డిసెంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది
ఈటీవీ విన్
లీలా వినోదం (తెలుగు) డిసెంబర్ 19
నెట్‌ప్లిక్స్
యోయో హనీసింగ్ (ఫేమస్ హిందీ డాక్యుమెంటరీ) – డిసెంబర్ 21
ద సిక్స్ ట్రిపుల్ ఎయిట్ (డిసెంబర్ 21)
సోనీ లీవ్ ఓటీటీ
క్యూబికల్స్ సీజన్ 4 (హిందీ డ్రామా వెబ్ సిరీస్) – డిసెంబర్ 20