Last Updated:

Deputy CM Pawan Kalyan: ‘జల్‌జీవన్ మిషన్‌’ మరింత బలోపేతం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడి

Deputy CM Pawan Kalyan: ‘జల్‌జీవన్ మిషన్‌’ మరింత బలోపేతం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడి

Deputy CM Pawan Kalyan Speech On Jal Jeevan Mission State Level Workshop: ‘జల్‌జీవన్ మిషన్‌’ను మరింత బలోపేతం చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. బుధవారం విజయవాడలో జరుగుతున్న ‘జల్‌జీవన్ మిషన్‌’వర్క్ షాప్‌నకు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 26 జిల్లాల్లో నీటి వసతులు, వినియోగంపై సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు వాటర్ సిస్టం నమూనాలను ఆయన పరిశీలించారు. అనంతరం జల్ జీవన్ మిషన్ వర్క్ షాప్‌ను ప్రారంభించారు. నీటి విషయంపై అందరూ మానవతా దృక్పథంతో మాట్లాడాలన్నారు. డిజైన్‌లో చాలా లోపాలున్నాయని వివరించారు. పైపు లైన్ వేస్తున్నారని, కనీసం మూడు అడుగుల ఎత్తు ఉన్న ప్రాంతాలకు నీరు అందడం లేదన్నారు.

ప్రతీ మనిషికి రోజూ కనీసం 55 లీటర్ల మంచి నీరు ఇవ్వాలనేది ప్రధాని కల అని గుర్తు చేశారు. ప్రతీ ఒక్కరికీ నీటి సరఫరా అందించడమే జల్ జీవన్ మిషన్ లక్ష్యమని, ఒక గంట నీళ్లు తాగకపోతే ఎంత కష్టమో అందరికీ తెలుసని పవన్ తెలిపారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న నీటి వసరులు, ప్రాజెక్టులను పరిరక్షించుకోవాలని సూచించారు. అయితే నీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులను పరిష్కరించేందుకు అమృతధార స్కీమ్ కింద విధివిధానాలను రూపకల్పన చేస్తున్నామన్నారు. లోతుగా వెళ్లే కొద్దీ సమస్యలు ఉత్పతన్నమవుతున్నాయని, ఈ విషయంలో సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు.

నీటి సరఫరా విషయంలో నిధులు మంజూరవుతున్నాయని, కానీ సమస్యల పరిష్కారం కావడం లేదన్నారు. అధికారులతో చర్చించి పరిష్కరిస్తున్నామని, జల్ జీవన్ మిషన్ ను బలంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. కేంద్రం విషయంలో నిధులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. అయితే ఉద్యోగులే కాకుండా ఇందులో ప్రజలను కూడా భాగస్వాములు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. ప్రస్తుతం ఉన్న నీటి వనరులు బలోపేతం చేయడం, నిర్వహణ ముఖ్యమన్నారు.

ఇదిలా ఉండగా, జల్‌జీవ్ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికి తాగునీటిని అందించడమే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా తాగునీటిని అందించాలన్నదే ఈ పథకం లక్ష్యమన్నారు. ఈ మేరకు కేంద్రం 80 శాతం నిధులు కేటాయించగా.. రాష్ట్రం నుంచి 10 శాతం, గ్రామ కమిటీల నుంచి 10 శాతం చొప్పున నిధులు సమకూర్చాలని ప్లానింగ్ చేశారు. అయితే కేంద్రం మంచి ఆశయంతో తీసుకొచ్చిన ఈ పథకాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదనే విషయంపై లోతుగా అధ్యయనం చేశామన్నారు.