Daaku Maharaj: బాలయ్య డాకు మహారాజ్ ఫస్ట్ సాంగ్ అవుట్ – మ్యూజిక్‌తో దుమ్మురేపిన తమన్
The Rage Of Daaku Lyrical Song Release: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత ఆయన నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా హిట్ చిత్రాల డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ఈ ఇద్దరి కాంబో సినిమా అనేగానే అంచనాలు ఓ రేంజ్‌కి వెళ్లాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రచార పోస్టర్స్, గ్లింప్స్‌లు మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇక సినిమాను నెక్ట్స్ ఇయర్ జనవరిలో రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మూవీ టీం నుంచి ప్రకటన వచ్చింది.
ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టింది మూవీ టీం. ఈ నేపథ్యంలో మ్యూజిక్ ప్రమోషన్స్ షూరు చేశారు. తాజాగా డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ పేరుతో తొలిసాంగ్‌ని రిలీజ్ చేశారు. ది రేజ్ ఆఫ్ డాకూ అంటూ రిలీజ్ చేసిన ఈ పాట యూబ్యూట్‌ని షేక్ చేసింది. ముఖ్యంగా తమన్ అందించిన మ్యూజిక్‌కు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. మరోసారి తమన్ తన మ్యూజిక్‌తో అద్భుతం చేశాడని, ఈ సినిమా మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ హిట్ పక్కా అంటున్నారు.
అనంత శ్రీరామ్ రాసిన ఈ పాట డాకు మహారాజ్ పాత్ర తీరుని తెలియజేస్తూ సాగింది. “డేగ డేగ డేగా దేఖో వో దేఖో బేగా.. ఈ గుర్రంపై నరసింహం చేసే సవారి ఇదేగా” అంటూ సాగే ఈ పవర్ఫుల్ లిరిక్స్‌కి తమన్ స్వరపరిచిన స్వరాలు ఈ పాటను నెక్ట్స్ లెవల్లో నిలబెట్టింది. అర్థవంతమైన, శక్తివంతమైన సాహిత్యానికి తమన్ సంగతం తొడవ్వడంతో ప్రతి బీట్ గూస్‌బంప్స్‌ని తెప్పి్సతుంది. భరత్ రాజ్, నకాష్ అజీజ్ రితేస్ జీ. రావు, కె ప్రణతి తమ అద్భుతమైన గాత్రంతో ఈ పాటకు మరింత అందాన్ని తీసుకువచ్చారు. ఈ పాటలో బాలయ్య మునుపెన్నడూ చూడిని సరికొత్త లుక్‌లో కనిపించారు.
ప్రతి ఫ్రేంతో అద్భుతంగా తీర్చిదిద్దాడు డైరెక్టర్ బాబీ. మొత్తానికి ఈ పాట సినిమాపై అంచనాలను మరింత రెట్టింపు చేస్తోంది. భారీ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్‌లు నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, చాందిని చౌదరి తదితర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితారా ఎంటర్‌టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సౌజన్యలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా 2025 జనవరి 12న ‘డాకు మహారాజ్’ వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.