Last Updated:

MP Dharmapuri Arvind: కేసీఆర్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతోంది.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్

MP Dharmapuri Arvind: కేసీఆర్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతోంది.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్

MP Dharmapuri Arvind comments BRS and Congress: రేవంత్, కేసీఆర్ ఇద్దరూ దుర్మార్గులేనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలు విస్మరిస్తే కేసీఆర్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి..?
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని అర్వింద్ ప్రశ్నించారు. కేసీఆర్‌తో కేటీఆర్, కవిత, హరీశ్‌రావు, సంతోష్ నాలుగు స్తంభాల ఆట ఆడుతున్నారని, వీరి నలుగురి మధ్య కేసీఆర్ నలిగిపోతున్నారన్నారు. అసెంబ్లీకి వెళ్లని కేసీఆర్ అపోజిషన్ లీడర్ ఎందుకయ్యారని నిలదీశారు. మైక్ ఇవ్వలేదని మొత్తుకుంటున్నారని, కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి మైక్ గురించి మాట్లాడాలని సూచించారు.

తెలంగాణ తల్లి విగ్రహం రాజకీయాలా..?
తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయం చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. పదేళ్లలో విగ్రహం విషయంలో ఎందుకు జీవో తేలేదో కేటీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌కు తెలంగాణ తల్లి విగ్రహంపై కమిట్మెంట్ లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ తెలంగాణనే దోచుకున్నారని, కాళేశ్వరంతో ఒక్క ఎకరా పారలేదన్నారు.

పనిచేయనోడు వర్కింగ్ ప్రెసిడెంట్..
కేటీఆర్ ఎవరు? ఆఫ్ట్రల్ ఎమ్మెల్యే మాత్రమే.. ఆయన గురించి ఏం క్వచ్చన్స్ అడుగుతారని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. బీఆర్‌ఎస్‌కు చెందిన 38మంది ఎమ్మెల్యేల్లో కేటీఆర్ ఒక్క ఎమ్మెల్యే మాత్రమేనని, పనిచేయనోడు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడని సెటైర్ వేశారు. కేటీఆర్, కవితకు కుక్క కూడా ఓటేయదని విమర్శలు గుప్పించారు. యాదగిరిగుట్ట మీద కేసీఆర్ ముక్కు, కారు గుర్తు చెక్కించుకున్నారని దయ్యబట్టారు. కవిత ఆక్టివ్ పాలిటికిస్‌లోకి వస్తే ఏం చేయమంటారు? ఆమెను చూసి గజగజ వణికిపోవాలా? అని ప్రశ్నించారు.

పసుపుబోర్డుపై అవాస్తవాలు..
అర్వింద్‌కు ఎప్పుడు ఏ గేర్‌లో బండి నడపలో తెలుసని, పసుపు బోర్డు నిజామాబాద్ నుంచి మహారాష్ట్రకు తరలివెళ్లిపోతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విమానాశ్రయాలపై ద్యాస పెట్టడం లేదని విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎయిర్ పోర్టు పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్‌కు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం మంజూరైందని చెప్పారు. విమానాశ్రయం వచ్చే జక్రాన్ పల్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తుచేశారు.

ప్రధాని మోడీకి ధన్యవాదాలు..
తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలు కేటాయించిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్పారు. 2 నిజామాబాద్ పార్లమెంట్‌కు కేటాయించారని, త్వరలో నిజామాబాద్‌కు కేంద్రీయ విద్యాలయం సైతం రానుందన్నారు. ఇప్పటి వరకు 25 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించాలని కోరారు. రేవంత్‌ను ఇచ్చిన వాగ్దానాలను అడిగితే నడ్డాపై విమర్శలు చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌ను నాశనం చేసి ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు రేవంత్‌ను ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న కుట్ర ఏమిటన్నారు.