Last Updated:

Jani Master: నన్ను అసోసియేషన్‌ నుంచి తొలగించలేదు, ఎన్నికలపై లీగల్‌ పోరాటం చేస్తున్నా – వీడియో రిలీజ్‌ చేసిన జానీ మాస్టర్‌

Jani Master: నన్ను అసోసియేషన్‌ నుంచి తొలగించలేదు, ఎన్నికలపై లీగల్‌ పోరాటం చేస్తున్నా – వీడియో రిలీజ్‌ చేసిన జానీ మాస్టర్‌

Jani Master Release Video: జానీ మాస్టర్ డ్యాన్సర్ అసోసియేషన్‌ నుంచి శాశ్వతంగా తొలగించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు ఎలాంటి సమాచారం లేకుండా అసోసియేషన్‌ ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. జోసెఫ్ ప్రకాష్ భారీ మెజారిటీతో అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించారని, అనంతరం జానీ మాస్టర్‌ను తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా తనపై వస్తున్న వార్తలపై జానీ మాస్టర్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన వీడియో రిలీజ్‌ చేశారు. ఈ వీడియో ఆయన మాట్లాడుతూ.. తనని ఏ అసోసియేషన్‌ నుంచి తొలగించలేదని స్పష్టం చేశారు.

ఆ అధికారం ఎవరికి లేదు

“డ్యాన్సర్‌ అసోసియేషన్‌ నుంచి నన్ను శాశ్వతంగా తొలగించారంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో ఏమాత్రం నిజం లేదు. నేను డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ మెంబర్‌ని. నిన్న జరిగిన ఎన్నికలపై నేను లీగల్‌గా ఫైట్‌ చేస్తున్నారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ సమయంలో నాకు సపోర్టు ఇస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కానీ కొన్ని ఛానల్‌ వాళ్లు తెలిసి తెలియని వార్తలను ప్రచారం చేస్తున్నారు. నన్ను శాశ్వతంగా తొలగించారు అంటూ పబ్లిష్‌ చేస్తున్నారు.

టాలెంట్ ని తొక్కలేరు

ఇక్కడ ఎవరిని తొలగించే అవకాశం లేదు. నన్నే కాదు ఎవరిని కూడా యూనియన్‌ నుంచి తొలగించారు. ఎక్కడ కూడా ఒకరిని టాలెంట్‌ని తొక్కలేరు. నాకు కొరియోగ్రాఫర్‌ అనే ట్యాగ్‌ ఉంది. అది చాలు. నాకు అవకాశాలు వస్తున్నాయి. ఓ పెద్ద సినిమాలో పాటకు రిహర్సల్స్‌ అవుతున్నాయి. త్వరలోనే ఆ పాట రిలీజ్‌ అవుతుంది. ఒకరి టాలెంట్‌ని తొక్కలేరు, పనిని ఆపలేరు. నన్ను బ్లెస్‌ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్‌. త్వరలోనే మంచి సాంగ్‌తో మీ ముందుకు వస్తాను” అని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ పోస్ట్‌కి “నిర్ధారణవ్వని ఆరోపణలని కారణంగా చూపిస్తూ నన్ను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్టు మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు. అవేవీ నమ్మకండి!! నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా వెళుతున్నాను. టాలెంట్ ఉన్నవారికి పనివ్వకుండా, దొరక్కుండా ఎవ్వరూ ఆపలేరు. నా కొరియోగ్రఫీలో #GameChanger నుండి ఓ మంచి పాట రాబోతుంది, మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది” అని క్యాప్షన్‌ ఇచ్చాడు.

కాగా జానీ మాస్టర్‌ లైంగిక ఆరోపణలు కేసులో అరెస్ట్‌ జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. తన దగ్గర అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా చేస్తున్న మహిళా కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై లైంగిక ఆరోపణలు చేసింది. కొంతకాలంగా జానీ మాస్టర్‌ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయనపై ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా ఉన్న ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు. సోమవారం ఈ పదవికి ఎన్నికలు నిర్వహించగా జోసెఫ్ ప్రకాష్ భారీ మెజారిటీతో గెలిచి అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు.