Last Updated:

Naga Chaitanya-Sobhita: పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన నాగచైతన్య-శోభిత – ఆకట్టుకుంటున్న అన్‌సీన్స్‌ పిక్స్‌

Naga Chaitanya-Sobhita: పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన నాగచైతన్య-శోభిత – ఆకట్టుకుంటున్న అన్‌సీన్స్‌ పిక్స్‌

Naga Chaitanya and Sobhita Wedding Photos: నాగ చైతన్య-శోభిత దూళిపాళ పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో డిసెంబర్‌ 4న వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

ఇరు కుటుంబసభ్యులు కొద్దిమంది బంధుమిత్రులు, ఇండస్ట్రీ ప్రముఖులు సమక్షంలో చై-శోభితలు ఏడడుగులు వేశారు. అయితే వీరి పెళ్లయి నాలుగు రోజులు అయ్యింది కానీ ఇంతవరకు పెళ్లి ఫోటోలను ఈ జంట షేర్‌ చేయలేదు.

అయితే తాజాగా ఈ కొత్త జంట పెళ్లి ఫోటోలు షేర్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేసింది. సాధారణంగా పెళ్లయిన స్టార్‌ కపుల్‌ కొన్ని గంటల్లోనే ఫోటోలు షేర్‌ చేసి ఫ్యాన్స్‌కి ట్రీట్‌ ఇస్తారు. కానీ చై శోభితలు మాత్రం నాలుగు రోజులు టైం తీసుకున్నారు.

“మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా.. కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం” అంటూ పెళ్లితో ఒక్కటైన మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. పెళ్లయ్యాక శోభితన చైని ప్రేమతో చెంపలు పట్టుకున్న ఫోటోను అందరిని బాగా ఆకట్టుకుంటుంది.

అంతేకాదు మూడుమూళ్ల పడిన ఆ క్షణాల్లో ఎమోషలైన సన్నివేశం, దండలు మార్చుకుంటున్నవి, తలంబ్రాలు, అరుంధతి నక్షత్రం చూపిస్తున్న ఫోటోలు ఇలా అన్‌సీన్‌ ఫోటోలను షేర్‌ చేసింది ఈ కొత్త జంట. ప్రస్తుతం ఈ పెళ్లి ఫోటోలు నెటిజన్లను, ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా పెళ్లి తర్వాత కొత్త జంట శ్రీశైలం వెళ్లిన సంగతి తెలిసిందే. పెళ్లయిన మరోసటి రోజే ఈ కొత్త జంట శ్రీశైలం మల్లన్న స్వామి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. వీరితో పాటు నాగార్జున కూడా వెళ్లారు.