OnePlus Green Line Solution: మంచి రోజులొచ్చాయ్.. గ్రీన్ లైన్ సమస్యకు చెక్.. వారికి లైఫ్ టైమ్ వారెంటీ..!
OnePlus Green Line Solution: మీరు వన్‌ప్లస్ యూజర్లు అయితే మీకు అదిరిపోయే శుభవార్త ఉంది. అదేంటంటే వన్‌ప్లస్ తన అన్ని స్మార్ట్ఫోన్ల గ్రీన్‌లైన్ సమస్యకు లైఫ్‌టైమ్ వారంటీని ప్రకటించింది. అంటే ఇప్పుడు మీ మొబైల్ గ్రీన్ లైన్ సమస్య కారణంగా పాడైపోతే కంపెనీ దానిని ఉచితంగా రిపేర్ చేస్తుంది.
వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు చాలా కాలంగా ఫోన్లో గ్రీన్ లైన్ సమస్యను ఎదుర్కొంటున్నారని, దీని గురించి వినియోగదారులు నిరంతరం ఫిర్యాదు చేస్తున్నారు. గ్రీన్ లైన్ సమస్య కారణంగా, వినియోగదారులు నేరుగా ఫోన్ డిస్ప్లేను మార్చవలసి వచ్చింది, దీని కారణంగా వినియోగదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పాత ఫోన్లపై కూడా గ్రీన్ లైన్ వారంటీ అందుబాటులో ఉంటుంది. ప్రాజెక్ట్ స్టార్‌లైట్ కింద సమాచారం ఇస్తూ.. వారంటీ గడువు ముగిసిన ఫోన్లలో గ్రీన్ లైన్ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని కంపెనీ తెలిపింది. అందువల్ల, కస్టమర్లందరినీ దృష్టిలో ఉంచుకుని, కొత్త స్మార్ట్ఫోన్లతో పాటు పాత హ్యాండ్సెట్లపై గ్రీన్ లైన్ సమస్యకు కంపెనీ లైఫ్ టైమ్ వారంటీని ప్రకటించింది.
2026 నాటికి భారతదేశంలోని తమ సర్వీస్ సెంటర్ల సామర్థ్యాన్ని 50 శాతానికి పెంచుతామని OnePlus తెలిపింది. ఇది కాకుండా, ఈ సమస్యను ఎప్పటికీ తొలగించడానికి కంపెనీ తన డిస్ప్లే టెక్నాలజీని మెరుగుపరచడానికి కృషి చేస్తోంది. AMOLED స్క్రీన్లతో సహా తన స్మార్ట్ఫోన్లకు మంచి ఎడ్జ్ బాండింగ్ లేయర్‌ను యాడ్ చేసే పనిలో ఉన్నామని కంపెనీ తెలిపింది. ఇది అత్యుత్తమమైన PVX ఎడ్జ్ సీలింగ్ మెటీరియల్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంది.
PVX ఎడ్జ్ సీలింగ్ మెటీరియల్‌ని ఉపయోగించి తయారు చేస్తున్నారు. ఇది చాలా బలంగా ఉంటుంది. ఇది కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ డిస్ప్లే తమ మెయిన్ టెస్టింగ్స్‌లో ఒకటైన ‘డబుల్ 85’ అని కంపెనీ తెలిపింది. దీనితో ఫోన్ డిస్ప్లే 85 డిగ్రీల సెల్సియస్, 85 శాతం తేమతో కూడిన స్థితిలో చాలా కాలం పాటు పనిచేస్తుంది.