Allu Arjun: సక్సెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించిన అల్లు అర్జున్ – ఇక మెగా, అల్లు వివాదం ముగిసినట్టేనా?
Allu Arjun Thank to Pawan Kalyan: కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు వివాదం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఎంతోకాలంగా దీనిపై వార్తలు వస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు కలిసి కనిపిస్తూ తాము ఒక్కటే అని ఈ రెండు కుటుంబాలు చూపిస్తు వస్తున్నాయి. అయితే ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఈ వివాదం బయటపడింది. పవన్ కళ్యాణ్‌కి కాదని తన స్నేహితులు, వైసీపీ అభ్యర్థి సింగారెడ్డి గారి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి తరపున ప్రచారంలో పాల్గొన్నాడు అల్లు అర్జున్. అది ఇండస్ట్రీలో, రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. బన్నీ ఇలా చేయడంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు జనసేన ఫాలోవర్స్ కూడా హర్ట్ అయ్యారు.
ఈ సంఘటనతో మెగా-అల్లు కుటుంబాల మధ్య మరింత దూరం పెరిగింది. దీనికి ఎప్పుడెప్పుడు ఎండ్ కార్డ్ పుడుతుందా? అని అభిమానులు మాత్రమే కాదు సినీ, రాజకీయా వర్గాల కూడా ఎదురుచూస్తున్నాయి. పుష్ప 2 రిలీజ్‌తో ఈ మనస్పర్థలు తొలుగుతాయాయో అనుకున్నారు. కానీ, అల్లు అర్జున్ ఎక్కడ వారి పేర్లు ప్రస్తావించలేదు. అలాగే మెగా ఫ్యామిలీ కూడా పుష్ప 2 గురించి ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దీంతో ఇది ఇంకా కొనసాగుతూనే ఉందని స్పష్టమైంది. ఇక ఈ మెగా-అల్లు ఫ్యామిలీ ఒక్కటై క్షణాలు ఎప్పుడు వస్తాయా అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించడం వీరి ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప 2’ విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. వసూళ్లు విషయంలో ఈ సినిమా రికార్డు నెలకొల్పోతుంది. ఈ క్రమంలో మూవీ టీం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్, చిత్ర బృందం, నిర్మాతలకు, ఈ సినిమాకు పని చేసిన టెక్నిషియన్ టీం ఇలా పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పాడు. అలాగే సినిమా ఇండస్ట్రీకి సపోర్టు ఇస్తూ టికెట్ రెట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడులకు పేర్లను ప్రస్తావిస్తూ వారు టాలీవుడ్‌కు ఇస్తున్న సపోర్టుకు కృతజ్ఞతలు తెలిపాడు.
అనంతరం స్పెషల్ జీవో పాస్ అయ్యి టికెట్ రేట్స్ పెరిగేందుకు కారణమైన ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సభాముఖంగా అభినందిస్తున్నారు. ఆయనకు స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్. ఇక వ్యక్తిగతంగా చెప్పాలంటే కళ్యాణ్ బాబాయ్.. థ్యాంక్యూ సో మచ్” అంటూ చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ నోటి నుంచి పవన్ కళ్యాణ్ పేరు రాగానే అక్కడ ఉన్న అభిమానులంతా ఒక్కసారిగా గట్టిగా అరిచారు. ప్రస్తుతం బన్నీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య మనస్పర్థలు తొలిగి ఎప్పుడు ఒక్కటవుతారా? అని ఎదురుచూస్తున్న వారికి బన్నీకామెంట్స్ కాస్తా ఊరటనిచ్చాయి. మరి బన్నీ కామెంట్స్‌కి మెగా ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.