Last Updated:

Pushpa 2 Day 3 Collection: బాక్సాఫీసు వద్ద పుష్ప 2 విధ్వంసం – 3 రోజుల్లోనే ఆ మార్క్‌, ఫాస్టెస్ట్‌ మూవీగా రికార్డు

Pushpa 2 Day 3 Collection: బాక్సాఫీసు వద్ద పుష్ప 2 విధ్వంసం – 3 రోజుల్లోనే ఆ మార్క్‌, ఫాస్టెస్ట్‌ మూవీగా రికార్డు

Pushpa 2 Movie Three Days Collection: అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ డిసెంబర్‌ 5న విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డు బ్రేక్‌ చేసిన పుష్ప ఇప్పుడు బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డ్స్‌ని సైతం బ్రేక్‌ చేసే దిశగా దూసుకుపోతుంది. అంతా ఊహించినట్టుగానే బాక్సాఫీస వద్ద సునామి వసూళ్లు రాబడుతుంది. మూవీ విడుదలైన అన్ని ఏరియాల్లో పుష్ప 2కి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఫలితంగా ఈ మూవీ పెయిడ్‌ ప్రీమియర్స్‌తో కలిపి రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 400 కోట్ల గ్రాస్‌ వసూళ్లు రాబట్టి సర్‌ప్రైజ్‌ చేసింది.

తొలి రోజు ఏకంగా రూ. 294 కోట్ల కలెక్షన్స్‌ చేసింది. రెండో రోజు రూ. 130 కోట్ల కలెక్షన్స్‌తో రెండ్రోజుల్లోనే రూ. 400 కోట్లకు పైగా కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది. తెలుగులో కంటే కూడా హిందీలో సాలీడ్ కలెక్షన్స్‌ను అందుకుంటోంది ఈ మూవీ. హిందీ బెల్ట్‌లోనూ పుష్ప జోరుగా మామూలుగా లేదు. బి-టౌన్‌ బాక్సాఫీసు వద్ద రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి దుమ్ముదులిపేస్తున్నాడు. మొత్తంగా ఈ సినిమా రెండు రోజుల్లో రూ. 449 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ చేసింది. ఇక మూడో రోజు శనివారం వీకెండ్ కావడంతో పుష్ప 2 అన్ని చోట్ల హౌస్‌ఫుల్ బోర్డ్స్ పడ్డాయి.

దీంతో మూడు రోజుల్లోనే పుష్ప 2 వరల్డ్‌ వైడ్‌గా రూ. 500 కోట్ల గ్రాస్‌ చేసిన ఫాస్టెస్ట్‌ ఇండియన్‌ సినిమాగా రికార్డు క్రియేట్‌ చేసింది. అంతేకాదు హిందీలోనూ అత్యధిక వసూళ్లు చేసిన సౌత్‌ మూవీగా కూడా పుష్ప రికార్డు బ్రేక్‌ చేసింది. బి-టౌన్‌ బాక్సాఫీసు వద్ద మూడో రోజు రూ. 74 కోట్ల గ్రాస్‌తో రికార్డు బ్రేక్‌ చేసింది. అలా హిందీ బెల్ట్‌లో పుష్ప 2 మూడు రోజుల్లో రూ. 205 కోట్ల గ్రాస్‌ చేసిన ఫాస్టెస్ట్‌ సినిమాగా నిలిచింది. ఇలా ప్రీమియర్స్‌ నుంచి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకున్న మూడు రోజుల్లోనే వరుసగా రికార్డ్‌ బ్రేక్‌ వసూళ్లు చేస్తోంది. ఆదివారం కూడా వీకెండ్‌ కావడంతో ఈ రోజు కూడా పుష్ప 2 థియేటర్లు హౌజ్‌ఫుల్‌ కనిపిస్తున్నాయి. ఇలా పుష్ప 2 రోజురోజుకు వసూళ్లు పెంచుకుంటూ అతి తక్కువ టైంలోనే రూ. 1000 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరేలా కనిపిస్తుంది. ఇప్పటి వరకు 15 రోజుల్లోనే రూ. 1000 కోట్లు సాధించిన ఫాస్టెస్ట్‌ సినిమా కల్కి 2898 ఏడీ ఉంది. ఈ సినిమాను రికార్డును కూడా ‘పుష్ప 2’ బ్రేక్‌ చేసేలా కనిపిస్తుందంటున్నారు ట్రేడ్‌ పండితులు.