CM Revanth reddy: రూ.వెయ్యి కోట్లతో కోకాకోలా కంపెనీ.. ప్రారంభించిన సీఎం రేవంత్
CM Revanth Reddy To Inaugurate 1000 Cr Coca Cola Green Field Plant: సిద్దిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్‌లో రూ.వెయ్యి కోట్లతో నిర్మించిన కోకాకోలా కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రులతో కలిసి కంపెనీ ప్రాంగణంలో తిరిగారు. ఈ మేరకు కంపెనీలో పలు వివరాలను తెలుసుకున్నారు. ప్రధానంగా శీతల పానీయం ఏ విధంగా తయారు చేస్తారనే విషయాన్ని అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అయితే, నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి కావొస్తోంది. ఈ తరుణంలో కంపెనీని ప్రారంభించడం శుభపరిణామని అన్నారు. కాగా, ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గజ్వేల్ ప్రాంతంలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. తొలి పర్యటనలోనే సుమారు.రూవెయ్యి కోట్లతో కంపెనీ ప్రారంభించడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తదితరులు ఉన్నారు.