Last Updated:

Pushpa 2 The Rule: పుష్ప-2 మూవీ నుంచి మరో అప్డేట్.. కొత్త సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

Pushpa 2 The Rule: పుష్ప-2 మూవీ నుంచి మరో అప్డేట్.. కొత్త సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

Pushpa 2 song Peelings update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’. ఈ మూవీని సెన్సెషనల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ డ్రామా సినిమాగా రూపొందుతున్న ఈ మూవీలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా, ఈ సినిమా నుంచి మేకర్స్ అప్డేట్ ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన మరో సాంగ్ రిలీజ్ కానుంది. ఇవాళ సాయంత్రం 6.03 నిమిషాలకు విడుదల కానున్నట్లు ప్రకటించారు.

‘పీలింగ్స్’ అంటూ సాగే ఈ సాంగ్ రిలీజ్ చేస్తునట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా, కొచ్చిలో జరిగిన ఓ ఈవెంట్‌లో అల్లు అర్జున్ ఈ సాంగ్ గురించి ప్రకటించిన విషయం తెలసిందే. ఇటీవల ఈ సాంగ్‌కు సంబంధించిన ఓ ప్రోమోను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సాంగ్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. అయితే ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ మైదానంలో రేపు పుష్ప-2 గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ వెంట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా సెన్సర్ పూర్తి చేసుకొని మొత్తం 6 భాషల్లో విడుదలవుతుండగా.. ఇప్పటికే 12వేలకు పైగా థియేటర్స్ బుక్ చేసుకున్నాయి. దీంతో ఐమాక్స్ ఫార్మాట్‌లో ఎక్కువ థియేటర్స్‌లో రిలీజ్ అవుతున్న ఇండియన్ ఫిల్మ్‌గా రికార్డుకెక్కనుంది.