Last Updated:

Audi Q7 Facelift: వారెవ్వా ఆడి.. క్యూ7 ఫేస్‌లిఫ్ట్‌ ఆగయా.. 250కిమీ వేగంతో పరుగులు..!

Audi Q7 Facelift: వారెవ్వా ఆడి.. క్యూ7 ఫేస్‌లిఫ్ట్‌ ఆగయా.. 250కిమీ వేగంతో పరుగులు..!

Audi Q7 Facelift: లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి తన కొత్త క్యూ7 ఫేస్‌లిఫ్ట్‌ను భారత ఆటో మార్కెట్‌లో విడుదల చేసింది. కంపెనీ ఈ కొత్త SUV ఎక్ట్సీరియర్, ఇంటీరియర్‌ను అప్‌డేట్ చేసింది. దీని ముందు వేరియంట్‌తో పోలిస్తే చాలా పెద్ద అప్‌గ్రేడ్లు చూస్తారు . కొత్త క్యూ7 ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 88.66 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 340 హార్స్‌పవర్, 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. దీని ధర, టాప్ ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందా.

Audi Q7 Facelift Price
కొత్త ఆడి క్యూ7 ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. ధర గురించి మాట్లాడితే దాని ప్రీమియమ్ ప్లస్ TFSI వేరియంట్  ఎక్స్-షోరూమ్ ధర రూ. 88.66 లక్షలు కాగా, హై స్పెక్ టెక్నాలజీ TFSI  ఎక్స్-షోరూమ్ ధర రూ. 97.81 లక్షలు. కంపెనీ తన బుకింగ్‌ను ప్రారంభించింది. మీరు దీన్ని ఆడి డీలర్‌షిప్ లేదా వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

Audi Q7 Facelift Design
కొత్త ఆడి క్యూ7 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ డిజైన్ ఆకట్టుకుంటుంది. ఇందులో LED హెడ్‌ల్యాంప్‌లు, మందపాటి క్రోమ్ సరౌండ్‌లు, హెక్సాగన్ ప్యాటర్న్ రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్ ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, Q7లో రీడిజైన్ చేసిన కొత్త బంపర్ కూడా ఉంది.

Audi Q7 Facelift Color
మీరు కొత్త ఆడి క్యూ7 ఫేస్‌లిఫ్ట్‌లో 5 కలర్ ఆప్షన్లు చూస్తారు. ఇందులో సఖిర్ గోల్డ్, వైటోమో బ్లూ, మైథోస్ బ్లాక్, సమురాయ్ గ్రే, గ్లేసియర్ వైట్ ఉన్నాయి. ఈ రంగులు కూడా చాలా రిచ్, ప్రీమియం. కస్టమర్ తన ఎంపిక ప్రకారం వాటిని ఎంచుకోవచ్చు.

Audi Q7 Facelift Features
కొత్త Q7 లోపలి భాగం ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ ప్రీమియం, హైటెక్ ఫీచర్లను కలిగి ఉంది. ఇది 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇది మాత్రమే కాదు, కొత్త క్యూ7లో 4-జోన్ క్లైమేట్ కంట్రోల్, పార్క్ అసిస్ట్‌తో కూడిన 360-డిగ్రీ కెమెరా వంటి అధునాతన ఫీచర్లు అందించారు. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉంది.

Audi Q7 Facelift Safety
ప్రయాణికుల భద్రత కోసం కొత్త Q7లో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, ADAS భద్రత ఉన్నాయి. ఇది కాకుండా, ఇది ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగల ఫ్రంట్ సీట్లు, పవర్డ్ టెయిల్ గేట్ సౌకర్యాన్ని కలిగి ఉంది.

Audi Q7 Facelift Engine
కొత్త SUV లో 3.0 లీటర్ V6 TFSI పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 340hp పవర్,  500Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఉంటుంది. ఇది ఆల్-వీల్-డ్రైవ్ టెక్నాలజీని కలిగి ఉంది.

Audi Q7 Facelift Speed
కొత్త Audi Q7 ఫేస్‌లిఫ్ట్ చాలా వేగవంతమైన SUV, ఇది 0-100 kmph నుండి 5.6 సెకన్లలో వేగాన్ని అందుకుంటుంది. దాని గరిష్ట వేగం 250 kmph. కొత్త Audi Q7 ఫేస్‌లిఫ్ట్ నేరుగా BMW X5, Mercedes-Benz GLE, Volvo XC90 వంటి కార్లతో పోటీపడుతుంది.