5G Spectrum Auction: 5G స్పెక్ట్రమ్ వేలం.. రూ.14,000 కోట్లు డిపాజిట్ చెల్లించిన రిలయన్స్ జియో
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ విడుదల చేసిన ప్రీ-క్వాలిఫైడ్ బిడ్డర్‌ల జాబితా ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క టెలికాం విభాగమైన రిలయన్స్ జియో, రాబోయే 5G స్పెక్ట్రమ్ వేలం కోసం 14,000 కోట్ల రూపాయల డబ్బు డిపాజిట్ (EMD) సమర్పించింది.
5G Spectrum Auction: డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ విడుదల చేసిన ప్రీ-క్వాలిఫైడ్ బిడ్డర్‌ల జాబితా ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క టెలికాం విభాగమైన రిలయన్స్ జియో, రాబోయే 5G స్పెక్ట్రమ్ వేలం కోసం 14,000 కోట్ల రూపాయల డబ్బు డిపాజిట్ (EMD) సమర్పించింది.
జియో ప్రత్యర్థి భారతీ ఎయిర్‌టెల్ రూ. 5,500 కోట్ల-ఇఎమ్‌డిని సమర్పించగా, దేశంలోని టెలికాం రంగంలో మూడవ ప్రధాన సంస్ద వొడాఫోన్ ఐడియా రూ. 2,200 కోట్ల డిపాజిట్‌ను సమర్పించింది.అదానీ డేటా నెట్‌వర్క్స్, బిలియనీర్ గౌతమ్ అదానీ యొక్క ఫ్లాగ్‌షిప్ అదానీ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ యొక్క యూనిట్ మరియు రాబోయే 5G స్పెక్ట్రమ్ వేలంలో భాగస్వామ్యాన్ని ప్రకటించిన తాజాది, రూ. 100 కోట్లని సమర్పించింది. జూలై 26 నుండి ప్రారంభం కానున్న వేలం కోసం దరఖాస్తు రుసుముగా పైన పేర్కొన్న భాగస్వాములందరూ రూ. 1,00,000 చెల్లించారు.
రూ. 14,000 కోట్ల డిపాజిట్ తో వేలం కోసం జియోకి కేటాయించిన అర్హత పాయింట్లు 1,59,830 గా ఉన్నాయి.ఎయిర్‌టెల్‌కు కేటాయించిన అర్హత పాయింట్లు 66,330 కాగా, వోడాఫోన్ ఐడియా 29,370.అదానీ డేటా నెట్‌వర్క్స్ దాని డిపాజిట్ ఆధారంగా 1,650 అర్హత పాయింట్లను పొందింది.
జులై 26న జరిగే వేలంలో మొత్తం 72 GHz (గిగాహెర్ట్జ్) స్పెక్ట్రమ్, కనీసం రూ. 4.3 లక్షల కోట్ల విలువైనదాన్ని వేలం వేయడం ద్వారా ప్రభుత్వం రూ. 80,000 కోట్ల నుండి రూ.1,00,000 కోట్లవరకూ సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది.వివిధ తక్కువ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లు (600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), మధ్య (3300 మెగాహెర్ట్జ్) మరియు హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లు (26) రేడియో తరంగాల కోసం వేలం నిర్వహించబడుతుంది.