Last Updated:

IPL 2025 Mega Auction 2025: ఐపీఎల్ మెగా వేలం.. ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు ధర.. వామ్మో అన్ని కోట్లా?

IPL 2025 Mega Auction 2025: ఐపీఎల్ మెగా వేలం.. ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు ధర.. వామ్మో అన్ని కోట్లా?

Shreyas Iyer Becomes Most Expensive Player Ever in IPL: ఐపీఎల్ మెగా వేలం మొదలైంది. ఈ వేలంలో మొత్తం 577 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ వేలం ధరలో శ్రేయస్ అయ్యర్‌కు అత్యధికంగా ధర పలికాడు. ఐపీఎల్ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు ధరకు పలకడం విశేషం. శ్రేయస్ అయ్యర్‌ను రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఈ ధరతో గతేడాది ఉన్న రికార్డు బద్దలైంది. అంతకుముందు స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే అర్ష్‌దీప్ సింగ్‌ను ఆర్టీఎమ్ కార్డు ద్వారా రూ.18కోట్లకు పంజాబ్ కింగ్స్ తీసుకుంది.

జెడ్డా వేదికగా ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. మొత్తం 10 ఫ్రాంచైజీలు 577 మంది ఆటగాళ్లను కొనుక్కునేందుకు కోట్లు వెదజల్లుతున్నాయి. ఇందులో 367 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 210 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే ఈ వేలంగా మొత్తం కలిపి 204 మంది క్రికెటర్లను మాత్రమే కొనుగోలు చేసుకునేందుకు వీలు ఉంది. కనీస ధర రూ.2 కోట్లు ఉన్న జాబితాలో దాదాపు 81 మంది ఆటగాళ్లు ఉన్నారు.

ఈ వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసుకునేందుకు మొత్తం 10 ఫ్రాంచైజీల వద్ద రూ.6415కోట్లు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా రూ.110.50 కోట్లు పంజాబ్ వద్ద ఉన్నాయి. బెంగళూరు రూ.83 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ రూ.73 కోట్లతో వేలంలో పాల్గొన్నాయి. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ చెరో రూ.69 కోట్లు ఉన్నాయి. అలాగే కోల్ కతా వద్ద రూ.51 కోట్లు, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద చెరో రూ.45 కోట్లు ఉండగా.. అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.41 కోట్లు మాత్రమే ఉన్నాయి.

కనీస ధర రూ.2కోట్లు ఉన్న భారత్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్‌ను రూ.18 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. అయితే మొదట్లో అర్ష్ దీప్ సింగ్‌ కోసం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోటీ పడగా.. గుజరాత్, బెంగళూరు, రాజస్థాన్ అతని కోసం బిడ్ వేశాయి. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ రంగంలోకి దిగాయి. కానీ చివరకు పంజాబ్ కింగ్స్ ఆర్టీఎమ్‌ను ప్రయోగించి అర్ష్ దీప్ సింగ్‌ను రూ.18కోట్లకు సొంతం చేసుకుంది.

ఇదిలా ఉండగా, శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. కనీస ధర రూ.2కోట్లు ఉన్న శ్రేయస్ కోసం ఏకంగా కోల్‌కతా, ఢిల్లీ విపరీతంగా పోటీపడ్డాయి. కానీ పంజాబ్ రేసులోకి వచ్చి రూ.26.75 కోట్లు సొంతం చేసుకుంది. అలాగే కగిసో రబాడను రూ.10.75కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.