Nagarjuna Akkineni: ‘ఆర్‌ఆర్‌ఆర్’ టైంలో ఆ టెక్నాలజీ లేదు – ‘పుష్ప 2’తో మన దేశంలో తొలిసారి ప్రారంభిస్తున్నాం
Nagarjuna Akkineni Comments at IFFI: భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ(IFFI) వేడుకలో నటుడు అక్కినేని నాగార్జున పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సినిమా, టెక్నాలజీ వంటి అంశాలపై అక్కడ చర్చించారు. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇప్పటి వరకు లేని ఓ అధునాత టెక్నాలజీ తొలిసారి తమ స్టూడియోలో ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. “మన దేశంలో ఇప్పటి వరకు డాల్బీ టెక్నాలజీ లేదు. ఆర్‌ఆర్ఆర్ సినిమాను డాల్బీ విజన్‌లో రూపొదించాలని డైరెక్టర్ రాజమౌళి అనుకున్నారు.
అయితే అప్పుడు ఈ టెక్నాలజీ సంబంధించిన సదుపాయలు ఎక్కడా మన దేశంలో లేవు. దీంతో ఆయన జర్మనీ వెళ్లారు. అక్కడ ఈ సినిమాకు సంబంధించిన పనులు పూర్తి చేశారు. అప్పుడే ఈ టెక్నాలజీ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. దీంతో డాల్బీని మా స్టూడియోలో ఏర్పాటు చేశాం. ‘పుష్ప 2’తో దాన్ని ప్రారంభింభిస్తున్నాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ సదుపాయాన్ని మా స్టూడియోలోనే ప్రారంభించడం ఆనందంగా ఉంది” అని చెప్పుకొచ్చారు. సినిమా ప్రమాణాలను పెంచి ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించేందుకు ఈ డాల్బీ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. డాల్బీ లాబోరేటరీస్‌లో ద్వారా సన్నివేశాలను రూపొందిస్తారు.