Nagarjuna: పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలోనే ఎందుకంటే.. చై-శోభితల వెడ్డింగ్‌పై నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Nagarjuna About Naga Chaitanya-Sobhita Wedding: నాగ చైతన్య-శోభిత ధూళిపాళ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. డిసెంబర్ 4న వీరి వివాహనికి ముహూర్తం ఖరారైందంటూ సినీవర్గాల నుంచి సమాచారం. అంతేకాదు వీరి వెడ్డింగ్ కార్డు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ 2024 అవార్డుల కార్యక్రమంలో పాల్గొన నాగార్జున అక్కడ ఓ అంగ్ల మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన నాగచైతన్య, శోభితల పెళ్లిపై స్పందించారు.
అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే చై-శోభితల పెళ్లి జరుగుతుంది. ఇద్దరు తమ పెళ్లిని సింపుల్‌గా చేసుకోవాలనుకుంటున్నారు. పెళ్లి పనులు కూడా వారే దగ్గరుండి చేసుకుంటున్నారు. ఇది మా నాన్నగారి శత జయంతి సంవత్సరం. అన్నపూర్ణ స్టూడియోస్ నాన్నకు ఇష్టమైన స్థలం . అలాంటి ఈ ప్లేస్ చై-శోభితల పెళ్లికి వేదిక అవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. స్టూడియోలో అందమైన సెట్లో వీరి పెళ్లి జరగనుంది. అక్కడ అన్ని వసతులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం అక్కడ కనీసం 10 పెళ్లిళ్లు జరుగుతుంటాయి. శోభిత తల్లిదండ్రులు కూడా సంప్రదాయబద్ధంగా చేయాలని కోరారు.
నాకు కూడా అది బాగా నచ్చింది. వేదామంత్రాల సాక్షిగా చై-శోభితలు ఒక్కటి కావడం సంతోషమే. ఆ మంత్రాలు కూడా వింటుంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. తన పెళ్లిని సంప్రదాయబద్ధంగా సింపుల్‌గా జరపాలి చై కూడా చెప్పాడు. అందుకే పెళ్లికి కూడా ఎక్కువమందిని పిలవడం లేదు. కుటుంబసభ్యులు, ఇండస్ట్రీ ప్రముఖులు, సన్నిహితులు కలిపి 300 నుంచి 400 మంది వరకు పెళ్లికి పిలవాలని అనుకుంటున్నాం. ప్రస్తుతానికి పెళ్లి జరుగుతున్నాయి. చై-శోభితలే దగ్గరుండి వారి పెళ్లి ఏర్పాట్లు చూసుకుంటున్నారు” అంటూ చెప్పుకొచ్చారు.
అనంతరం శోభిత గురించి చెబుతూ.. “శోభిత ఉన్నతమైన ఆలోచనలు కలిగిన అమ్మాయి. గుఢచారి సినిమా చూసి తనకు కాల్ చేసి అభినందించాను. హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటికి వచ్చి కలవమని కూడా ఆహ్వానించాను. తన వైజాగ్ నుంచి వచ్చిన సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ స్థాయికి రావడానికి తను ఎంతో కష్టపడింది. తన సినీ కెరీర్ ఎంతో మందికి స్ఫూర్తి. తను గొప్ప నటి. శోభిత వచ్చాక చై చాలా సంతోషంగా ఉన్నాడు. వారిద్దరిని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు.