Last Updated:

RRR : గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. బెస్ట్ సాంగ్ గా “నాటు నాటు”

భారతదేశం గర్వించదగ్గ సినిమాలలో ఆర్ఆర్ఆర్ కూడా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు కలిసి నటించారు. ఆలానే ఈ మూవీలో అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియా శరణ్‌, ఆలియా భట్‌లు కీలక పాత్రల్లో కనిపించారు.

RRR : గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్..  బెస్ట్ సాంగ్ గా “నాటు నాటు”

RRR : భారతదేశం గర్వించదగ్గ సినిమాలలో ఆర్ఆర్ఆర్ కూడా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు కలిసి నటించారు. ఆలానే ఈ మూవీలో అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియా శరణ్‌, ఆలియా భట్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. 2022 మార్చి 24న రిలీజ్‌ అయిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా రికార్డులను తిరగరాసింది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం భారత్ లోనే కాకుండా యూఎస్, జపాన్‌ లోనూ ఈ సినిమాకి బ్రహ్మరధం పడుతున్నారు. అలానే ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కైవసం చేసుకుంటుంది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ నుంచి ఇటీవలే బెస్ట్‌ డైరెక్టర్‌గా ఆర్ఆర్ఆర్ మూవీకి రాజమౌళి అందుకున్నారు. తాజాగా ఈ సినిమా మరోసారి చరిత్రను తిరగరాసింది.

ఇప్పటికే ఎన్నో అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం గోల్డెన్ గ్లోబ్‌ అవార్డులకు కూడా నామినేట్ అయిన విషయం తెలిసిందే. రెండు కేటగిరీల్లో అవార్డ్‌ కోసం ఈ మూవీ పోటీ పడింది. బెస్ట్‌ నాన్ ఇంగ్లీష్‌ కేటగిరీ, బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ఆర్ఆర్ఆర్ పోటీ పడుతుంది. కాగా తాజాగా బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ‘నాటు.. నాటు’ సాంగ్ సత్తా చాటింది. బెస్ట్ సాంగ్ కేటగిరీలో అవార్డును కైవసం చేసుకుంది. మరికాసేపట్లో బెస్ట్‌ నాన్ ఇంగ్లీష్‌ కేటగిరీలో విన్నర్ ను కూడా అనౌన్స్ చేయనున్నారు.

 

 

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకి అవార్డు రావడం పట్ల పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.

ఇది తెలుగు ప్రేక్షకులు గర్వించదగ్గ విషయం అని మెగా, నందమూరి అభిమనులతో పాటు ప్రేక్షకులంతా పోస్ట్ లు చేస్తున్నారు.

ఇలానే ఆస్కార్ అవార్డుల్లో కూడా ఆర్ఆర్ఆర్ సత్తా చాటాలని కోరుకుంటున్నారు.

ఇక నిన్న ఆర్ఆర్ఆర్ సినిమాని ఆస్కార్ నామినేషన్స్ లో భాగంగా ఓటర్స్ కోసం లాస్ ఏంజెల్స్ లోని చైనీస్ థియేటర్ లో స్క్రీనింగ్ చేశారు. ఈ సినిమా చూసేందుకు విదేశీయులు ఫుల్ గా ఎగబడ్డారు. ఏ మూవీకి లేని విధంగా ఈ చిత్రం టికెట్ లు కేవలం ఆన్ లైన్ లో 96 సెకండ్లలోనే అమ్ముడు పోవడం గమనార్హం. ఇక ఈ స్క్రీనింగ్ లో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ హాజరయ్యి అభిమనులతో సరదాగా ముచ్చటించారు.

 

ఇవి కూడా చదవండి…

RRR: కాలిఫోర్నియా ఐమాక్స్‌లో “ఆర్ఆర్ఆర్” పూనకాలు.. రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ మానియా.. ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ

Kantara: బిగ్ సర్‌ప్రైజ్.. ఆస్కార్‌కు క్వాలిఫై అయిన “కాంతారా”

Samantha: మీకు నాలాగ అవ్వకూడదంటూ.. వారికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన సమంత

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

ఇవి కూడా చదవండి: