Published On:

Deputy CM Bhatti Vikramarka: రాష్ట్రంలో ఉపాధి, ఆదాయాన్ని సృష్టించే కుటీర పరిశ్రమలు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

Deputy CM Bhatti Vikramarka: రాష్ట్రంలో ఉపాధి, ఆదాయాన్ని సృష్టించే కుటీర పరిశ్రమలు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

Deputy CM Bhatti Vikramarka: ఉపాధి, ఆదాయాన్ని సృష్టించే కుటీర పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ట్యాంక్ బండ్‌పై బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ చేతి, వృత్తి కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకానికి సంబంధించిన స్టాల్స్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. కళాకారులు, చేతివృత్తుల ఉత్పత్తులు సమాజానికి ఉపయోగపడతాయన్నారు. చేతి వృత్తుల ఉత్పత్తులను ప్రోత్సహించి ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు.

 

బీసీ చేతి, వృత్తి కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన ఈనెల 25 నుంచి 29 వరకు కొనసాగుతుందని, హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల నుంచి కుటీర పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తుల ప్రదర్శన జరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ ఎగ్జిబిషన్‌ను రాష్ట్ర ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ ప్రదర్శనను తిలకించి నచ్చిన వస్తువులు, పర్యావరణహితమైన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉత్పత్తులు కొనుగోలు చేసి చేతి వృత్తుల వారికి చేయూతనివ్వాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు.

 

అలాగే బీసీ కార్పొరేషన్లపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఇందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌లో కుమ్మరులమట్టి పాత్రలు, మేదరి వెదురు వస్తువులు, పూసల సామగ్రి ఉంచుతామన్నారు. అదే విధంగా పోచంపల్లి, గద్వాల, నారాయణపేట మొదలైన చేనేత ఉత్పత్తులతో పాటు నీరా ఉత్పత్తులను డిప్యూటీ సీఎం పరిశీలించారు. అనంతరం దీనికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా చేపల వంటకాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో కలిసి డిప్యూటీ సీఎం రుచి చూశారు.

ఇవి కూడా చదవండి: