Oppo A3 Pro 5G: ఒప్పో బడాప్లాన్.. బడ్టెట్ 5జీ ఫోన్ వస్తుంది.. అందరిచూపు దీనిపైనే..!

Oppo A3 Pro 5G: ఒప్పో ప్రేమికులకు ఇదిగో ఒక తీపి వార్త. కొత్త ఫోన్ త్వరలో కస్టమర్ల చేతికి రానుంది. కంపెనీ కొత్త OPPO A5 Pro 5Gని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది గత జూన్‌లో లాంచ్ అయిన Oppo A3 Pro 5G ఫోన్ సక్సెసర్. త్వరలో విడుదల కాబోతున్న కొత్త మొబైల్ ధర, కీలక ఫీచర్లు వెల్లడయ్యాయి. ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దాం.

Oppo A3 Pro 5G ఫోన్‌ను కంపెనీ భారతదేశంలో రూ. 17,999కి విడుదల చేసింది. దీని ప్రకారం రాబోయే Oppo A5 Pro 5G రూ. 20 వేల కంటే తక్కువ ధరతో పరిచయం చేయచ్చు. ఈ ఫోన్ MediaTek Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఫోన్‌లో 12GB RAM + 512GB ఇంటర్న్ స్టోరేజ్ ఉంది. దీనితో పాటు 6.7 అంగుళాల డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరా, 6000mAh బ్యాటరీ సహా అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది.

Oppo A3 Pro 5Gని కంపెనీ బడ్జెట్ ధరలో విడుదల చేయనుంది. ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ.20,000. ఉంటుంది. ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 20,000 లోపు ఉంటుంది. టాప్ వేరియంట్ ధర రూ.22,000.  ప్రస్తుతం Oppo A3 Pro 5G ఫోన్ 8GB+128GB స్టోరేజ్ ధర భారతదేశంలో రూ.17,999. 8GB+256GB స్టోరేజ్ ధర రూ.19,999. ఉంది

Oppo A5 Pro 5G మొబైల్ లాంచ్ గురించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారాన్ని ప్రకటించలేదు. అయితే కొత్త ఏడాదికి ఈ స్మార్ట్‌ఫోన్‌ను గ్రాండ్‌గా విడుదల చేయవచ్చని అంటున్నారు. కంపెనీ Oppo A5 Pro 5G ఫోన్‌ను జనవరి 2025 నెలలో విడుదల చేయవచ్చు. ఈ మొబైల్‌ను ముందుగా చైనాలో విడుదల చేయనున్నారు. తర్వాత భారత మార్కెట్లోకి ప్రవేశిస్తుంది.

Oppo A5 Pro 5G Features
Oppo A5 Pro 5G మొబైల్ 6.7-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది పంచ్ హోల్ AMOLED డిస్‌ప్లే. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

Oppo A5 Pro 5G ఫోన్‌లో MediaTek Dimension 7300 Energy octa-core ప్రాసెసర్‌ ఉంటుంది. సరికొత్త ఆండ్రాయిడ్ 5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో కలర్‌ఓఎస్ 15తో స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో 8GB RAM ఉంది. రాబోయే Oppo A5 Pro 5G మొబైల్ 12GB RAM తో వస్తుంది. ఫోన్ పెద్ద వేరియంట్ 12GB RAM+ 512GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. బేస్ వేరియంట్ 8GB RAM +256GB స్టోరేజ్‌తో వస్తుంది.

Oppo A5 Pro 5G ఫోన్‌లో కంపెనీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను ప్యాక్ చేస్తుంది. ఇది OIS టెక్నాలజీతో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా,  2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ ప్రియుల కోసం ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. మొబైల్ 6000mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది.