Mobile Offer: ఫ్లిప్‌కార్ట్ ధనా ధన్ ఆఫర్.. మోటరోలా ఎడ్జ్ 50 నియో.. రూ.9 వేల డిస్కౌంట్..!

Mobile Offer: మీరు మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, ఫ్లిప్‌కార్ట్‌లో మీ కోసం గొప్ప డీల్ ఉంది. Motorola Edge 50 Neo ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లో చాలా తక్కువ ధరకు అమ్మకానికి ఉంది. లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర ఎక్కువగా ఉంది, కానీ ధర తగ్గింపు కారణంగా ఇప్పుడు దాదాపు రూ. 9 వేల తక్కువ ధరకే దీన్ని మీ సొంతం చేసుకోవచ్చు. శక్తివంతమైన ఫీచర్లతో ప్యాక్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ అనేక గొప్ప ఫీచర్లను కలిగి ఉంది. ఈ క్రమంలో మొబైల్‌పై ఎటువంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి? స్పెసిఫికేషన్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

Motorola Edge 50 Neo Offers
మోటరోలా ఎడ్జ్ 50 నియో ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. IDFC బ్యాంక్ కార్డ్‌లపై తక్షణ తగ్గింపు రూ. 1000 ఇస్తున్నారు. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో పాత ఫోన్ విలువ రూ.20,000 వరకు ఉంటుంది. అంటే ఫోన్  ప్రభావవంతమైన ధర బాగా తగ్గుతుంది.

Motorola Edge 50 Neo Specifications
మోటరోలా ఈ ఏడాది ఆగస్టులో ఈ ఫోన్‌ను విడుదల చేసింది. శక్తివంతమైన ప్రాసెసర్, బలమైన బ్యాటరీ బ్యాకప్‌ను అందించే ఫోన్ డిజైన్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది మన్నికైన ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో రూపొందించారు. వాటర్, డస్ట్ నుంచి సురక్షితంగా ఉంచడానికి ఇది IP68 రేటింగ్‌ను పొందింది.  6.4 అంగుళాల LTPO OLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ కలిగి ఉంది. ఫోన్‌లో MediaTek డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ప్రాసెసర్ అందించారు. ఇది 12 GB RAM+ 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది.

ఫోటోగ్రఫీ కోసం ఈ మోటరోలా మొబైల్‌లో 50MP ప్రైమరీ, 10MP సెకండరీ, 13MP సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ,  వీడియో కాలింగ్ కోసం 32MP సెన్సార్ ఉంది. పవర్ కోసం ఫోన్ 68W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 4310mAh లాంగ్ బ్యాటరీని కలిగి ఉంది.

మోటరోలా ఎడ్జ్50 నియో పవర్ ఫుల్ మల్టీ టాస్కింగ్, గేమింగ్, రోజువారీ అవసరాలకు బెటర్‌గా ఉంటుంది. ఇది మంచి పర్ఫామెన్స్‌ను ఆఫర్ చేస్తుంది.ఈ ఫోన్‌లో MediaTek ప్రాసెసర్‌ని అమర్చారు. ఇందులో ప్రొఫెషనల్ కెమెరా, వైబ్రెంట్ డిస్‌ప్లే ఉంది.ది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ కలిగి ఉంది.