Limited Time Deal: లిమిటెడ్ ఆఫర్.. వన్‌ప్లస్ ఫోన్ కొంటే బడ్స్ ఫ్రీ.. డిస్కౌంట్ల జాతర..!

Limited Time Deal: చైనీస్ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ OnePlus Nord CE4 5Gపై ప్రత్యేకమైన డీల్స్, డిస్కౌంట్లు అందిస్తుంది. ఈ కామర్స్ సైట్ అమెజాన్ నుంచి ఈ మొబైల్ కొనుగోలు చేసినప్పుడు కంపెనీ రూ. 1599 విలువైన OnePlus Nord Buds 2Rని పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. అయితే ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. బ్యాంక్ ఆఫర్‌ల కారణంగా ఫోన్‌లపై తగ్గింపులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫోన్‌ను చౌకగా ఆర్డర్ చేయడానికి, ఉచిత ఇయర్‌బడ్‌లను పొందడానికి ఇది మంచి అవకాశం. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ నార్ట్ సిరీస్‌లో OnePlus Nord CE4 5Gని విడుదల చేసింది. ఇది మంచి పర్ఫామెన్స్, లాంగ్ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ఉంది. అలానే మొబైల్‌ని ఫాస్ట్‌గా ఛార్జ్ చేయడానికి కంపెనీ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో శక్తివంతమైన బ్యాటరీని అందిస్తోంది. కెమెరాపై దృష్టి కేంద్రీకరించే వినియోగదారుల కోసం, OnePlus Nord CE4 5G ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP సోనీ సెన్సార్ కెమెరాను అందిస్తోంది.

OnePlus Nord CE4 5G Offers
8GB RAM+128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో OnePlus స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ.24,999. అయితే లిమిటెడ్ ఆఫర్ కారణంగా ఇది అమెజాన్‌లో రూ.22,999కి ఉంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు లేదా OneCard క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేస్తే, రూ. 1000 ఫ్లాట్ తగ్గింపు అందుబాటులో ఉంది, ఆ తర్వాత ఫోన్ ధర రూ. 21,999కి తగ్గుతుంది. నో-కాస్ట్ EMIలో కూడా ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

కస్టమర్లు కోరుకుంటే, వారు తమ పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేసేటప్పుడు గరిష్టంగా రూ. 18,900 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపును పొందచ్చు, దీని విలువ పాత ఫోన్ మోడల్, స్థితిపై ఆధారపడి ఉంటుంది. దీనితో, OnePlus Nord Buds 2r ఇయర్‌బడ్‌లు ఉచితంగా లభిస్తాయి. ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంద. అందులో సెలడాన్ మార్బుల్, డార్క్ క్రోమ్ ఉన్నాయి.

OnePlus Nord CE4 5G Specifications
ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 1100నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ 6.7-అంగుళాల ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. మంచి పనితీరు కోసం, ఇది స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది.  ఆండ్రాయిడ్ 14 ఆధారంగా కలర్‌ఓఎస్ 14ని కలిగి ఉంది. వెనుక ప్యానెల్‌లో OIS, 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో 50MP సోనీ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ అందించారు. ఈ మొబైల్ 5500mAh బ్యాటరీ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను పొందుతుంది. 16MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.