Dil Raju Comments: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. సమావేశం అనంతరం ఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎంతో చర్చించిన విషయాలను తెలియజేశారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారన్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు ముఖ్యమంత్రి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారన్నారు.
“ఇటీవల చిత్ర పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య దూరం ఏర్పడిందనే ప్రచారం జరిగింది. అది కేవలం అపోహా మాత్రమే. అందులో నిజం లేదు. తెలుగు సినీ పరిశ్రమ పట్ల తనకు ఉన్న విజన్‌ను సీఎం తమతో పంచుకున్నారన్నారు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయడానికి ఇండస్ట్రీ, ప్రభుత్వం కలిసి పని చేయాలన్నారు. అందుకు అనుగుణంగా మేమంతా కలిసి వర్క్ చేస్తాం. హైదరాబాద్‌లో హాలీవుడ్ సినిమాలు కూడా నిర్మించేలా పాటుపడాలని సీఎం సూచించారు. తెలంగాణ సామాజిక అంశాలలో నటీనటులు ఇక నుంచి పాల్గొంటారు.
గంజాయ్, డ్రగ్స్ నిర్మూలన కోసం హీరోలు, హీరోయిన్లు తమ వంతు పాటు పడతారు. ఐటీ, ఫార్మాతో పాటు సినీ పరిశ్రమ కూడా ప్రభుత్వానికి ముఖ్యమని సీఎం అన్నారు” అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఈ సమావేశం సానుకూలంగా జరిగిందని, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఇండస్ట్రీ పనిచేస్తుందన్నారు. బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు వంటి అంశాలు చాలా చిన్నవని, సినీ పరిశ్రమ అభివృద్ది ప్రధాన ఎజెండా అన్నారు. ఈ దిశగా ఇండస్ట్రీ అంతా సమావేశమై చర్చించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని, త్వరలోనే మరోసారి సినీ పెద్దలతో కలిసి సీఎంతో సమావేశం అవుతామని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
We are delighted with the fruitful meeting held today between the Telangana Government and representatives of the Telugu Film Industry facilitated by the Film Development Corporation of Telangana.
We deeply appreciate the visionary leadership of our Honourable Chief Minister Sri…
— Sri Venkateswara Creations (@SVC_official) December 26, 2024