Google AI: ఏఐపై ఫోకస్ పెట్టిన గూగుల్.. జీ మెయిల్, గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్

ప్రముఖ టెక్‌ కంపెనీ గూగుల్‌ ప్రతి ఏడాది నిర్వహించే వార్షిక సమావేశం ‘గూగుల్‌ I/O 2023’జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ పలు కొత్త ఉత్పత్తులను, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్ ను ఆవిష్కరించింది.

Google AI: ప్రముఖ టెక్‌ కంపెనీ గూగుల్‌ ప్రతి ఏడాది నిర్వహించే వార్షిక సమావేశం ‘గూగుల్‌ I/O 2023’జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ పలు కొత్త ఉత్పత్తులను, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్ ను ఆవిష్కరించింది. అంతేకాకుండా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంస్థ భవిష్యత్ కార్యకలాపాలను ప్రకటించారు. అందులో ముఖ్యంగా గూగుల్ నుంచి తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ‘Pixel Fold’సహా ‘Pixel 7a’ స్మార్ట్‌ ఫోన్‌, Pixel Tablet ను విడుదల చేశారు. సాఫ్ట్‌వేర్‌ పరంగా చూస్తే ‘Find My divise’, వాట్సాప్‌కు WearOS, Unwanted tracker alert లాంటి కొత్త అప్‌డేట్స్ గురించి వివరింయారు. అదే విధంగా రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్ సేవలకు ఎలా తోడవ్వనుందో తెలియజేశారు.

త్వరలో ఏఐ ఫీచర్స్(Google AI)

సెర్చ్ ఇంజిన్ కు మరింత టెక్నాలజీతో కూడిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో కూడిన ఫీచర్లను జత చేయనున్నట్టు టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. రానున్న రోజుల్లో తమ సేవల్లో ఏఐని విస్తృతంగా ఉపయోగించుకున్నట్టు పేర్కొంది. అంతేకాకుండా అన్ని దేశాల్లో చాట్ జీపీటీ తరహా చాట్ బాట్ బార్డ్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. ఇంగ్లీష్ సహా ఇతర భాషల్లోనూ బార్డ్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

 

జీమెయిల్ లో న్యూ ఫీచర్

మరో వైపు జీ మెయిల్ కు ‘Help me right’, ‘Music Editor’ లాంటి ఏఐ ఫీచర్లను యాడ్ చేయనున్నట్టు పేర్కొంది. దీంతో ఈ మెయిల్స్ రాసేటప్పుడు ఉపయోగపడే ‘హెల్ప్‌ మీ రైట్‌’ అనే ఆప్షన్‌ను జీ మెయిల్‌లో అందుబాటులోకి రానుంది. గూగుల్‌ మ్యాప్స్‌లో ఇమ్మర్సీవ్‌ రూట్లను చూపించడానికి ‘Immersive View’ పేరిట ఏఐ ఫీచర్‌ను ఇవ్వనుంది. దీనిలో రోజంతా వాతావరణ అప్‌డేట్లు కూడా ఉండనున్నాయి.

అదే విధంగా ఫొటోను ఎడిట్‌ చేసేందుకు ఇప్పటికే అందుబాటులో ఉన్న మ్యాజిక్‌ ఎరేజర్‌కు మరింత అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను కూడా గూగుల్‌ యూజర్లకు పరిచయం చేయనుంది. దీనికి మ్యాజిక్‌ ఎడిటర్‌గా పేరు పెట్టింది. ఇది గూగుల్‌ ఫొటోస్‌లో మరికొన్ని నెలల్లోనే అందుబాటులోకి రానుంది.