Today Gold And Silver Prices: గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్ ఈరోజు బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిన్నటితో పోలిస్తే నేడు మార్కెట్ లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు భారీగా పెరగడంతో ప్రజలు బంగారం కొనుగోళ్ళ పై నిరాశ చెందుతున్నారు. మరి నేడు దేశంలోని వివిధ ప్రధాన నగరాలలోని పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
దేశ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో జులై 9 ఆదివారం నాడు 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.59,510లు నమోదైంది. అలాగే, 22 క్యారెట్ల గోల్డ్ రూ.54,550 వద్ద నమోదైంది. నిన్నటితో పోలిస్తే.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.440లు పెరిగితే, 22 క్యారెట్ల ధర రూ.400 పెరిగింది. అదే సమయంలో వెండి ధర కూడా కేజీపై రూ.1000లు పెరిగి కొనుగోలుదారులకు ఒక్కసారిగా షాక్ ఇస్తున్నాయి.
ధరలు ఇలా(Today Gold And Silver Prices)
ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54,550 ఉండగా, 24 క్యారెట్లు రూ.59,510 వద్ద నమోదు అవుతుంది. ఢిల్లీ లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.54,700 ఉండగా 24 క్యారెట్లు గోల్డ్ ధర రూ.59,660 నమోదైంది. అలాగే హైదరాబాద్ లో 22 క్యారెట్లు గోల్డ్ ధర రూ.54,550 ఉండగా 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,510గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.54,550 కాగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.59,510గా కొనసాగుతుంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర .54,550, 24 క్యారెట్లు రూ.59,510 నమోదైంది.
బంగారం పెరిగితే వెండి కూడా అదే దారిలో పరుగులు పెట్టింది.. ఈరోజు మార్కెట్ లో వెండి ధర కిలోకు ఒకేసారి వెయ్యి రూపాయలు పెరిగింది.. ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే. ముంబై రూ. 73300, ఢిల్లీ రూ. 73300, కోల్‌కతా రూ. 73300, బెంగళూరు రూ. 72750, హైదరాబాద్ రూ. 76700,విశాఖ, విజయవాడలో కిలో వెండి ధర రూ. 76700గా కొనసాగుతోంది.