Last Updated:

Apple layoffs: యాపిల్ లోనూ లేఆఫ్స్ భయం.. త్వరలో ఉద్యోగాల కోతలు

పెరుగుతున్న వడ్డీ రేట్లు, ప్రపంచ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో టెక్ కంపెనీలు గత ఏడాది డిసెంబర్ నుంచి భారీగా ఉద్యోగాల కోతలు విధించిన విషయం తెలిసిందే.

Apple layoffs: యాపిల్ లోనూ లేఆఫ్స్ భయం.. త్వరలో ఉద్యోగాల కోతలు

Apple layoffs: ఆర్థిక మాంద్యం భయంతో ఖర్చులను అదుపులో ఉంచేందుకు ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీలన్నీ పొదుపు చర్యలను పాటిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని దిగ్గజ కంపెనీలు వేలల్లో ఉద్యోగులను తొలగించాయి. అదేవిధంగా ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాల్లో కూడా కోతలు విధించాయి. తాజాగా లేఆఫ్స్ లిస్ట్ లోకి దిగ్గజ మొబైల్ కంపెనీ యాపిల్ కూడా చేరనుంది. అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ , ట్విటర్, సిస్కో.. ఇలా దాదాపు అన్ని టెక్ సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలిగించినా.. ఇప్పటి వరకు యాపిల్ లేఆఫ్స్ లోకి వెళ్లలేదు. కానీ తాజగా వచ్చిన సమాచారం ప్రకారం యాపిల్ లోనూ ఉద్యోగులపై వేటు పడనున్నట్టు తెలుస్తోంది.

 

యాపిల్ రిటైల్ టీమ్స్ లో..(Apple layoffs)

బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం యాపిల్ లో పరిమిత సంఖ్యలో ఉద్యోగుల కోతలు ఉండనున్నట్టు తెలిపింది. ఈ కోతలు కంపెనీ రిటైల్ టీమ్స్ లో ఉంటాయని నివేదిక సారాంశం. ఎంత మంది ఉద్యోగులు అని తెలియక పోయినా.. ఉద్యోగులు తొలగింపు తక్కువగా ఉంటుందని పేర్కొంది. అయితే దీనిపై యాపిల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

పెరుగుతున్న వడ్డీ రేట్లు, ప్రపంచ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో టెక్ కంపెనీలు గత ఏడాది డిసెంబర్ నుంచి భారీగా ఉద్యోగాల కోతలు విధించిన విషయం తెలిసిందే. ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా ఈ ఏడాది రెండు ధపాలుగా దాదాపు 20 వేల మంది ఉద్యోగులను తొలగించింది. గుగూల్ 12 వేలమందిని, అమెజాన్ పలు రౌండ్లలో 27 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపింది.