Home / Uttar Pradesh
యూపీ బస్తీ జిల్లాలో 9 ఏళ్ల బాలుడిని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపీ ఎస్ యు వి ఢీకొట్టడంతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
500 కిలోల గంజాయిని ఎలుకలు తిన్నాయని మధుర పోలీసులు ప్రత్యేక నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కోర్టుకు నివేదిక సమర్పించారు.
మనిషి తప్పు చేస్తే జీవిత ఖైదు విధించడం చూశాము. కానీ ఓ కోతికి కూడా జీవిత ఖైదు విధించారు. ఇకపై అది జీవితాంతం బోనులో ఉండాల్సిందే. అంతగా ఆ కోతి ఏం చేసింది ఎందుకు, ఎక్కడ దానికి జీవిత ఖైదు విధించారో ఓ సారి చూసేద్దాం.
ఉత్తరప్రదేశ్ బరేలీ జంక్షన్ వద్ద టీటీఈ రైలు నుంచి నెట్టడంతో కిందపడిన ఆర్మీ జవాన్ మరణించాడు. నవంబర్ 17న జరిగిన ఈ సంఘటనలో గాయపడిన జవాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్య జరిగిన కొన్ని రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో మరో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. తన మాజీ ప్రియురాలిని గొంతు కోసి హత్య చేసి, ఆమె తల నరికి, శరీరాన్ని 6 భాగాలుగా నరికిన మాజీ ప్రేమికుడు అరెస్ట్ అయ్యాడు.
ఉత్తరప్రదేశ్ లోని మెయిన్‌పురి పార్లమెంట్ స్థానానికి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా డింపుల్ యాదవ్ పేరును పార్టీ గురువారం ప్రకటించింది. పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి డిసెంబర్ 5న ఉప ఎన్నిక జరగనుంది.
గుజరాత్ రాష్ట్రం మోర్బీలో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జ్ ఘటనను మరవకముందే ఉత్తరప్రదేశ్ లో ఓ కల్వర్డు కుప్పకూలింది. అయితే ఘటనలో ప్రజలు క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు.
డేటా సెంటర్ వ్యాపారంలో భాగంగా యోట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉత్తరప్రదేశ్‌లో రూ.39వేల కోట్లు పెట్టుబడి పెట్టనుందని కంపెనీ కో ఫౌండర్, హిరానందానీ గ్రూపు చైర్మన్ దర్శన్ హిరానందాని పేర్కొన్నారు.
ద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ శాసనసభ సెక్రటేరియట్ అతనిపై అనర్హత వేటు వేసింది.
స్థానికుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ మెుదలుపెట్టారు.టీ తయారీకి ఉపయోగించిన వస్తువులను పరిశీలిస్తే ఐతే శివానందన్ భార్య పొరపాటున టీ పొడికి బదులు పొలాలకు వాడే పిచికారీ మందును కలిపినట్లు పోలీసుల విచారణలో తేలింది.