Home / ts latest news
Mulugu: ములుగు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడి హత్య స్థానికంగా కలకలం రేపింది. తనను వేధిస్తున్న సమీప బంధువును యువతి కత్తితో పొడిచి హత్య చేసింది. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది.
Cyber Crime: సినీ, రాజకీయన నేతల ఫోటోలను మార్ఫింగ్ చేసిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కొందరు సోషల్ మీడియాలో రాజకీయ, సినీ నేపథ్యం ఉన్నవారిని టార్గెట్ గా చేసుకొని వారి ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారు.
Traffic Restrictions: శ్రీరామనవమి శోభాయాత్రకు సమయం ఆసన్నమైంది. ఈ వేడుక హైదరాబాద్ లో కన్నుల పండువగా జరగనుంది. వేలాది మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొననున్నారు. దీంతో హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Badrachalam: రామయ్య సంబురాలకు భద్రాద్రి ముస్తాబవుతోంది. జానకిరాముల వివాహ వేడుకను వైభవంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. అశేష భక్తజనం మధ్య.. రఘురాముడికి పట్టాభిషేకం జరపనున్నారు.
MLA Durgam Chinnayya: బీఆర్ఎస్ నేత.. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేశారు. తమను నమ్మించి మోసం చేశారని.. మహిళ వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో మంచిర్యాలలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.
KTR: హైదరాబాద్ అభివృద్ధిపై కేంద్రం వివక్ష చూపిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో హైదరాబాద్ రోజురోజుకి విస్తరిస్తోందని.. అయినా కేంద్రం సహకరించడం లేదని అన్నారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లిలో చెరువుల అభివృద్ధి కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
YS Sharmila: హైదరాబాద్ లోని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇంటివద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో వైఎస్ షర్మిల కిందపడిపోయారు.
MLC Kavitha: దిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నుంచి మరోసారి పిలుపు అందింది. నేడు ఈడీ కార్యాలయానికి రావాలని.. లేఖ ద్వారా తెలిపింది.
MLC Kavitha: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ సమన్లు పంపడాన్ని సవాల్ చేస్తూ.. ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటీషన్ పై సోమవారం సుప్రీం కోర్టు విచారణ చేయనుంది.