Home / Telangana News
Telangana Assembly Budget Sessions Begins From Today: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఉదయం 11 గంటలకు తొలుత గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. 13న గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉంటుంది. 14న హోలీ సెలవు కారణంగా అసెంబ్లీకి కూడా సెలవు ప్రకటించారు. 15న గవర్నర్ ప్రసంగానికి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు. అయితే మరోవైపు ఈ సభను గురువారానికి వాయిదా […]
BJP Leader Arvind with his New Bride: హైదరాబాద్లో బీజేపీ నేత చేసిన నిర్వాహం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కార్వాన్ నియోజకవర్గ గోల్కొండ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు గురాజాల అరవింద్ కుమార్.. ఓ నవ వధువుతో పరారయ్యాడు. కాగా, ఆయనకు ఇప్పటికే వివాహం కావడంతో పాటు పాప కూడా ఉంది. వివరాల ప్రకారం.. బీజేపీ నేత అరవింద్ కుమార్(46)కు లంగర్ హౌస్ పరిధిలోని గొల్లబస్తీలో ఉంటున్న ఓ యువతి గత కొంతకాలంగా పరిచయం […]
Half Day Schools in Telangana from 15th March: సమ్మర్ రాకముందే భానుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నాడు. తెలంగాణలో పలు జిల్లాలలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి పాఠశాలలను ఒంటిపూట నడపాలని నిర్ణయించింది. ఇక, తెలంగాణలో విపరీతమైన ఉక్కపోత మొదలైంది. మార్చి ప్రారంభం నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఉదయం దాటగానే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండల తీవ్రతకు చిరు వ్యా పారులు […]
Big Twist in Malakpet Sirisha Death Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన వివాహిత శిరీష హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. అక్క కోసమే భార్యను భర్త వినయ్ కుమార్ హత్య చేసినట్లు తేలింది. అయితే గత కొంతకాలంగా వినయ్ సోదరి సరితకు, శిరీషకు గొడవ జరిగిందని, ఈ విషయంలో అక్కకు ఎదురు తిరుగుతోందన్న కోపంతో హత్య చేసినట్లు తెలుస్తోంది. చివరకు శిరీషకు మత్తుమందు ఇచ్చి వినయ్ హత్య చేసినట్లు తెలుస్తోంది. అయితే శిరీస్ స్పృహ […]
CM Revanth Reddy Announcement about new ration cards: ఉగాది పండుగ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కొత్త రేషన్ కార్డు నమూనాను సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ చేశారు. లేత నీలి రంగులో ఈ కొత్త రేషన్ కార్డును తయారు చేయాలని ఆదేశించారు. కార్డుపై సీఎం, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ఉంటాయి. రేషన్ కార్డుపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఏర్పాటు […]
Women’s Groups to Provide Buses to RTC: మహిళలకు రేవంత్ రెడ్డి సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. అంతర్జాతీయ మహిళా దినో త్సవం సందర్భంగా రాష్ట్రంలోని పేదింటి మహిళలకు అద్దె బస్సులు కేటాయించనుంది. ఇందులో భాగంగానే మహిళా సంఘాలకు స్వయం ఉపాధిలో భాగంగా ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇందుకు సంబంధించిన జీఓను ప్రభుత్వం జారీ చేసింది. తొలి విడతలో 150 మహిళా సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దెబస్సులు కేటాయించనుంది. […]
MLC Election Results: తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఫలితాల్లో సంచలన విజయాలు నమోదయ్యాయి. కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోగా.. మరో చోట ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానంలో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్ధులు విజయం సాధించారు. ఉమ్మడి నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించగా.. ఉమ్మడి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో బీజేపీ మద్దతు పలికిన అభ్యర్థి మల్క […]
Indiramma Housing Scheme Deposit the First Installment: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక ప్రకటన చేసింది. తొలి విడతలో 71,482 ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ లభించగా.. దాదాపు 700 మంది నిర్మాణం ప్రారంభించారు. అయితే ఈ పది రోజుల్లో ఎక్కువమంది లబ్దిదారులు ప్రారంభించనున్నారు. ఇంటి నిర్మాణంలో భాగంగా ఒకవేళ బేస్ మెంట్ పూర్తయిన సమక్షంలో లబ్ధిదారుల ఖాతాల్లో మార్చి 15వ తేదీలోగా రూ.లక్ష చొప్పున నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. […]
Cm Revanth Reddy : ఎలాంటి ప్రాణ నష్టం ఉండకూడదనే ఉద్దేశంతో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో మనుషులు, మిషిన్లతోపాటు అవసరమైతే రోబోల సాయం తీసుకునే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. సొరంగంలో ఎనిమిది మంది గల్లంతైన నేపథ్యంలో సహాయక చర్యలను సీఎం, మంత్రులు టన్నెల్లోకి వెళ్లి స్వయంగా పరిశీలించారు. అనంతరం ఎస్ఎల్బీసీ వద్ద అన్ని విభాగాల అధికారులు, ఏజెన్సీలతో సహాయక చర్యలపై సమీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. పదేళ్లుగా పట్టించుకోలేదు.. ఎస్ఎల్బీసీ టన్నెల్ను […]
Congress MLC Teenmar Mallanna Suspension: కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్ తగిలింది. ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. గత కొంతకాలంగా మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు ఇటీవల జరిగిన బీసీ సభలో ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. దీంతో పాటు తీన్మార్ మల్లన్న పార్టీ వ్యతిరేక చర్యలకు సైతం పాల్పడుతున్నారనే […]