Home / Pawan Kalyan
పవన్ అభిమానులుకు గుడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు.. మరోవైపు వరుసగా సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. రన్ రాజా రన్, సాహోలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవన్ తన తదుపరి సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన మేకర్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు
హైదరాబాదులోని శిల్పకళావేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సీఏ విద్యార్థుల అంతర్జాతీయ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం తాను ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ కిందే లెక్క అని వెల్లడించారు.
2024లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీకి సీఎం అవుతారంటూ మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామజోగయ్య ధీమా వ్యక్తం చేశారు
ఇప్పటంలో ఇళ్ల కూల్చి తన గుండెళ్లో గునపం దింపారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 2024లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తాం అని సవాల్ విసిరారు. కూల్చివేతలో అధికారులు పద్ధతి పాటించలేదని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పరిహారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం తనను బాధించిందని ఆయన తెలిపారు.
పవన్ కల్యాణ్ అభిమానులతోపాటు సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా ఓ సందేశాన్ని మరియు కొన్ని ఫొటోలను హరిహర వీరమల్లు టీం నెట్టింట ప్రేక్షకులతో పంచుకుంది.
మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు పలు రంగాలకు చెందిన వారు మెగాస్టార్ ను అభినందించారు.
దర్శకుడు హరీష్ శంకర్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సరైన హీరో కోసం వెతుకుతున్నాడు. భవదీయుడు భగత్ సింగ్ ను పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేద్దామని భావించినా పవన్ బిజీ షెడ్యూల్ తో ఆ చిత్రం పట్టాలెక్కలేదు.
మెగాస్టార్ చిరంజీవి నేడు హైదరాబాదులోని వైఎన్ఎం కాలేజి పూర్వవిద్యార్థుల సమ్మేళనానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ రాజకీయాలపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కూడా అనుకున్నది చేసే రకమని ఆయన వెల్లడించారు. రాజకీయాలకు పవన్ తగినవాడు అని పేర్కొన్నారు.
జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఝాన్సీ లక్ష్మీబాయి 194వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు న ఆయన నటించిన ‘జల్సా’ చిత్రాన్ని పలు ధియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ చిత్ర ప్రదర్శన ద్వారా జనసేన పార్టీ కార్యకర్తలు రూ. కోటి విరాళాన్నిసేకరించారు.