Home / New Delhi
4 New Members To Rajyasabha: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేశారు. కసబ్ కేసు ప్రాసిక్యూటర్ గా ఉన్న ఉజ్వల్ నిగమ్ తో పాటు సదానందన్, హర్షవర్ధన్, మీనాక్షిజైన్ ను రాజ్యసభ సభ్యులుగా నామినేట్ చేశారు. రాజ్యాంగంలోని అధికారాల ప్రకారం భారత రాష్ట్రపతి రాజ్యసభకు నలుగురు ప్రముఖులను నామినేట్ చేశారు. సాహిత్యం, సైన్స్, కళలు, సామాజిక సేవ వంటి రంగాలలో సేవలు అందించిన ప్రముఖ వ్యక్తులను గుర్తించి రాజ్యసభ సభ్యులుగా నామినేట్ […]
Building Collapse in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని జనతా మజ్దూర్ కాలనీలో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భవనంలో నివాసం ఉండే వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగాయి. ఇప్పటివరకు నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. భవనం శిథిలాల […]
Emergency Period: దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులపై కాంగ్రెస్ నేత, ఎంపీ హాట్ కామెంట్స్ చేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా తీవ్ర విమర్శలు చేస్తూ ఓ ఆర్టికల్ లో రాసుకొచ్చారు. ఎమర్జెన్సీని ప్రకటించడం ఓ చీకటి అధ్యాయం, ఆ చీకటి అధ్యాయం నుంచి నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే ఎమర్జెన్సీ సమయంలో అందరి స్వేచ్ఛను హరించారు. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అణచి వేసే ప్రయత్నం చేశారని ప్రాజెక్ట్ సిండికేట్ […]
Heavy Rains: దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. కుండపోతగా కురిసిన వానకు నగరమంతా నీటమునిగింది. పలుచోట్ల రహదారులు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీవర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కుండపోత వర్షాలతో ఢిల్లీలో విమాన రాకపోకలపై తీవ్ర అంతరాయం ఏర్పడింది. నజాఫగఢ్ లో అత్యధికంగా 60 మి.మీ. వర్షపాతం నమోదైంది. మరోవైపు నేడు, రేపు కూడా ఢిల్లీలో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరికలు […]
Toll Charges Resumes On Highway: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైవే టోల్ ఛార్జీలను తగ్గించింది. వంతెనలు, సొరంగాలు, ఫ్లైఓవర్లపై టోల్ ఛార్జీలను దాదాపు 50 శాతం తగ్గించింది. తగ్గిన టోల్ ఛార్జీలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో వాహనదారులపై భారం తగ్గుతుంది. ముఖ్యంగా వాణిజ్య వాహనాలకు పెద్ద ఊరట కలగనుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ జాతీయ రహదారుల రుసుము నియమాలు- 2008ని […]
AP and Telangana High Courts: తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులకు త్వరలోనే మరికొందరు కొత్త జడ్జీలు రానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలను నియమించాలని నిర్ణయించింది. ఏపీ హైకోర్టు జడ్జిగా జస్టిస్ తుహిన్ కుమార్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అలాగే తెలంగాణ హైకోర్టుకు నలుగురు జడ్జీల నియామకానికి కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టుకు జడ్జీలుగా జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, జస్టిస్ గౌస్ […]
Insurence Claims In Accidents: ప్రమాద బీమా పాలసీ చెల్లింపుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వలన జరిగిన ప్రమాదంలో మరణించిన వారికి బీమా కంపెనీలు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహాదేవన్ తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. కాగా కర్ణాటకలోని మల్లసందర్ గ్రామానికి చెందిన ఎన్ ఎస్ రవీష్ […]
Union Cabinet Decisions: కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. పలు అంశాలపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కొత్త స్పోర్ట్స్ పాలసీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాలతోపాటు క్రీడాకారుల సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేయనుంది. అలాగే రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ పథాకానికి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రూ. లక్ష కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. అలాగే రీసెర్చ్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం […]
Lal Darvaja Bonalu In New Delhi: ఢిల్లీలో మూడు రోజుల పాటు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ వెల్లడించింది. ఈనెల 30 నుంచి జులై 2 వరకు వేడుకలకను ఘనంగా నిర్వహించనున్నామని తెలిపింది. ఈ మేరకు నిన్న ఓ ప్రకటన చేసింది. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు తెలంగాణ భవన్ లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. జులై 1న ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ […]
Official Language Day: అధికార భాషా దినోత్సవాన్ని ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్రమంత్రులు అమిత్ షా, బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. తాను ఏ భాషకు వ్యతిరేకం కాదన్నారు. కానీ మన భాషలోనే మాట్లాడితేనే బాగుంటుందని తెలిపారు. మాతృభాషను గౌరవించకపోవడం బానిసత్వమే అవుతుందని పేర్కొన్నారు. విదేశీ భాషలను గౌరవించాలని కానీ.. మాతృభాషను మర్చిపోవద్దన్నారు. “ఓ వ్యక్తి తన భాషను గౌరవించకపోతే, తన భాషలో మాట్లాడకపోతే, తన […]