Home / national
All-party meeting chaired by Rajnath Singh : పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్ అనే పేరుతో ఇండియా పాక్‌కు గట్టిగా బదులిచ్చింది. దేశ భద్రతా బలగాలు మంగళవారం అర్ధరాత్రి ఉగ్రస్థావరాలపై దాడిచేయగా, దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఆపరేషన్ సిందూర్ గురించి వివరించడానికి కేంద్రప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దేశమంతా ఐక్యంగా నిలబడాలని ప్రధాని ఇచ్చిన సందేశాన్ని వినిపించింది. భేటీకి ముందు ప్రధాని నివాసానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వచ్చారు. ఈ నేపథ్యంలో […]
NSA Doval Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరోసారి భేటీ అయ్యారు. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం ప్రధాని మోదీతో తొలిసారి భేటీ అయిన అజిత్ దోవల్.. సరిహద్దుల్లో ప్రస్తుతం చోటుచేసుకున్న పరిస్థితులపై చర్చిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేసిన విషయం తెలిపిందే. మొత్తం 9 ఉగ్రవాదుల స్థావరాలపై చేసిన దాడిలో 80 మంది ఉగ్రవాదులు మృతి […]
4 ki Crashes in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర కాశీ జిల్లా గంగ్నాని వద్ద హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పర్యాటకులు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరికి తీవ్రీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే వీరంతా హెలికాప్టర్లో గంగోత్రి వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. […]
Jaish-e-Mohammed chief Masood Azhar warns PM Modi : ఇండియా చెప్పినట్టే పాక్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాదులను వెంటాడి హతం చేసింది. మంగళవారం అర్ధరాత్రి 9 ప్రాంతాల్లో దాడులు చేసింది. సుమారు 100 మంది ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన మొత్తం 10 మంది సభ్యులు, నలుగురు అనుచరులు మృతిచెందారు. ఘటనపై మసూద్ కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. చనిపోయిన వారిలో ఐదుగురు పిల్లలు […]
Indian Army : కొద్ది రోజులుగా సరిహద్దు నియంత్రణ రేఖ ఎల్వోసీ వెంట పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. పహల్గాం ఉగ్రదాడికి బదులుగా పాకిస్థాన్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ సైన్యం మంగళవారం అర్ధరాత్రి ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో దాడులకు పాల్పడింది. దీంతో బుధవారం పాకిస్థాన్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 15 మంది భారత పౌరులు మృతిచెందారు. 43 మంది గాయపడినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. పూంఛ్, తంగ్ధర్ సెక్టార్లలో మంగళవారం […]
Defence Minister Rajnath Singh : ఉగ్రదాడిలో అమాయకులను చంపిన వారినే లక్ష్యంగా చేసుకున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. హనుమంతుడు అనుసరించిన సూత్రాన్నే భారత్ అనుసరించిందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌పై ఆయన స్పందించారు. బుధవారం 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 50 బీఆర్వో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను రక్షణ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు. భారత సాయుధ దళాలు తమ శౌర్యం, ధైర్యాన్ని ప్రదర్శించి […]
Operation Sindoor : పాక్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన మిలిటరీ యాక్షన్‌కు ‘ఆపరేషన్ సిందూర్’ సరైన పేరు అని పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ భార్య హిమాన్షీ అభిప్రాయపడ్డారు. తాజాగా ఆమె ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. కేంద్రం సరైన సమయంలో చర్యలు తీసుకుందని, భవిష్యత్‌లో ఇలానే కొనసాగించి ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ఆమె కోరారు. ఉగ్రవాదాన్ని అంతం చేసి దేశానికి శాంతి తీసుకురావాలన్న లక్ష్యంతో తన భర్త రక్షణ దళాల్లో […]
Mock Drills : పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మరోపక్క ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఇండియా మెరుపు దాడులతో గట్టిగా సమాధానం చెప్పింది. జీర్ణించుకోలేని పాక్ తాము దాడులు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తోంది. సంక్షోభ సమయంలో ప్రజలు తమ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అన్న అంశంపై అవగాహన కల్పించాలని కేంద్రహోం శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్స్ ప్రారంభమయ్యాయి. మాక్ డ్రిల్స్‌లో […]
IndiGo : జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పీవోకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో భారత గగనతలంలో కొంతమేర కేంద్రం ఆంక్షలు విధించింది. ఇప్పటికే పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. తాజాగా ప్రముఖ విమానాయాన సంస్థ ఇండిగో కీలక ప్రకటన చేసింది. ఈ నెల 10వ తేదీ వరకు 165 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గగనతలంపై ఆంక్షల నేపథ్యంలో అమృత్సర్, […]
Who is Colonel Sophia Qureshi, briefed media on Operation Sindoor: పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ దాడి చేయగా.. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడుల అనంతరం ఢిల్లీలో భారత సాయుధ దళాల అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తొలుత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడారు. అనంతరం భారత సాయుధ దళాలకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీ […]