Home / Ap Government
సంకల్పానికి మించిన ఆయుధం మరొకటి లేదని.. స్త్రీ అనుకుంటే సాధించలేనిది ఏది లేదని మరో మహిళ నిరూపించింది. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఓవైపు కూలీ పనులు చేసుకుంటూనే భర్త ప్రోత్సాహంతో మరో వైపు చదువును కొనసాగించింది. అవిశ్రాంతంగా పేదరికంపై పోరాడి.. కృష్టి, పట్టుదలతో చివరికి తాను అనుకున్నది సాధించిన ఆ వీర వనిత పేరు.. సాకే భారతి ..
2024లో రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మళ్లీ టికెట్ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థి (ఇండిపెండెంట్)గా పోటీ చేస్తానని వైకాపా సీనియర్ నేత, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. ఈ మేరకు రామచంద్రపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బోస్ మాట్లాడారు.
ఏపీ ప్రజలకి సంబంధించిన అన్ని వివరాలు సేకరిస్తున్న డేటాపై ప్రభుత్వం తక్షణమే వివరణ ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తన ట్వీట్‌కి ఓ వీడియోని కూడా ఆయన జత చేశారు. త్వరలో రాష్ట్రమంతా ఉద్యమంలా ప్రజలు వైఎస్ఆర్సిపిపై తిరుగుబాటు మొదలు పెడతారు సిద్ధంగా ఉండు జగన్ అంటూ జనసేన శతఘ్ని టీం హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ వరకు ఒంటి పూట మాత్రమే బడి నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం 7:30 గంటల నుంచి 11:30 గంటల వరకే తరగతులు నిర్వహించాలని.. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు
స్థానిక సంస్థల కోటాలో గెలిచిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నేడు ( మే 15, 2023 ) న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు వారితో మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ప్రమాణం చేయించారు. నర్తు రామారావు, కుడిపూడి సూర్యనారాయణ, కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్, అలంపూర్ మధుసూదన్, సిపాయి సుబ్రహ్మణ్యం, మేరుగు మురళీధర్, రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ లుగా ప్రమాణం చేశారు.
Chandra Babu Naidu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ సర్కారు భారీ షాక్ ఇచ్చింది. విజయవాడలోని కరకట్టపై ఉన్న చంద్రబాబు నాయుడు గెస్ట్‌హౌస్ ని అటాచ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్రిమినల్ లా అమెండమెంట్ 1994 చట్టం ప్రకారం గెస్ట్ హౌస్ ని అటాచ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. సదరు గెస్ట్ హౌస్ విషయంలో చట్టాలు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలు, సాధారణ ఆర్థిక నియమాలు పూర్తిగా ఉల్లంఘించారని ఆరోపించింది. […]
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అతిపెద్ద కార్యక్రమం చేపట్టడానికి శ్రీకారం చుట్టింది. "మహాయజ్ఞం" పేరిట ఆరు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేయనున్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ఈ మహా యజ్ఞం నిర్వహిస్తున్నామని ఏపీ సర్కారు వివరించింది. మొదటి రోజు, చివరి రోజు జరిగే రాజశ్యామల యాగంలో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. జగన్ సర్కారు ఏర్పాటు చేసిన “సిట్” (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) పై సుప్రీం కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ దర్యాప్తు జరిపేందుకు ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు సుప్రీం తీర్పుతో లైన్ క్లియర్ అయ్యిందని చెప్పవచ్చు. కాగా అంతకు ముందు
తెలుగు చిత్ర పరిశ్రమలో రాజకీయాల రగడ కొత్తది ఏమి కాదు. అయితే ఇప్పుడు ఊహించని రీతిలో మళ్ళీ అనూహ్యంగా తెరపైకి వచ్చింది. నంది పురస్కారాలపై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ చేసిన వ్యాఖ్యలకు పోసాని కృష్ణ మురళి ఇప్పుడు గట్టి కౌంటర్ ఇవ్వడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరిగిందో మీకోసం ప్రత్యేకంగా..
Posters In AP : ఏపీలో అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు రావడం కలకలం రేపుతుంది. ఒక వైపు విజయవాడలో కార్మికులను రోడ్డున పడేసిన చరిత్ర వైసీపీదే అంటూ పోస్టర్లు వేశారు. మరోవైపు రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం-సుస్వాగతం అంటూ విశాఖలో ఏర్పాటుచేసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 3న విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయంతో ఏపీ రాజధాని లేని […]