Home / Air india Flight Crash
Air india flight crash: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బ్లాక్ బాక్స్ నుంచి డేటా డౌన్ లోడ్ చేసుకోవడానికి అమెరికా నుంచి ‘గోల్డెన్ ఛాసిస్’ అనే ప్రత్యేక పరికరాన్ని తీసుకువచ్చారు అధికారులు. ప్రమాదం నుంచి బ్లాక్ బాక్స్ ను వెంటనే గుర్తించినా.. దాని నుంచి డేటాను డౌన్ లోడ్ చేయడం కత్తిమీద సాము లాంటిదే. ప్రమాద సమయంలో ఏర్పడిన తీవ్రవేడి వల్ల అది దెబ్బతింది. దీంతో ఈ ప్రత్యేక పరికరాన్ని తెప్పించి డేటా డౌన్ లోడ్ […]
Air India flight: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కుట్రకోణంపై దర్యాప్తు చేయిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఇటీవల గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో AI-171 విమానం కూలిపోయి 279 మంది మృతిచెందగా, ఈ ఘటనలో కుట్ర కోణంపై తాము దృష్టి సారించామని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ చెప్పారు. విమాన ప్రమాదం కేసును ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కేసు దర్యాప్తు చేస్తోందని తెలిపారు. పుణేలో జరుగుతున్న ఓ కాన్క్లేవ్లో మంత్రి మాట్లాడారు. […]
Ahmedabad Plane Crash Air India Flight black Box sending to Foreign: ఈ నెల 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో దాదాపు 270 మంది మృతిచెందారు. ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఘటనపై అధికారులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో కీలకమైన బ్లాక్‌బాక్స్ ప్రమాదంలో దెబ్బతిన్నట్లు తెలిసింది. బాక్స్‌లోని డేటాను విశ్లేషించేందుకు విదేశాలకు పంపనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వాషింగ్టన్కు పంపే అవకాశం.. అహ్మదాబాద్ […]
Manchu Lakshmi Travel in Air India Flight to London: అహ్మదాబాద్ ఎయిరిండియా ప్లైయిట్ ఘటనకు యావత్ దేశం ఉలిక్కిపడింది. ఈ ప్రమాదం వందల మంది కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఎయిరిండియా విమానం కుప్పకూలిపోయింది. ఓ మెడికల్ కాలేజ్ బిల్డింగ్‌పై కూలడంతో అందులోని వైద్యులు, సిబ్బంది, మెడికల్ స్టూడెంట్స్ సైతం ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన 260పైగా మంది చనిపోయినట్లు తెలుస్తోంది. […]
Unni Mukundan Reacts in Ahmadabad Flight Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై మాలీవుడ్ హీరో ఉన్ని ముకుందన్ స్పందించారు. విమాన ప్రమాద ఘటన తెలిసి షాక్ గురయ్యాయని, ఆ ప్రాంతంతో తనకు 24 ఏళ్ల అనుబంధం ఉందంటూ ఎమోషనల్ అయ్యాడు. తన బాల్యమంత అక్కడే గడిచిందని, తాను నివసించిన ప్రాంతంలో ఘోరమైన విషాదం జరగడం తనని తీవ్రంగా కలిచివేసిందన్నాడు. విమాన ఘటన తెలియగానే తాను, తన స్కూల్ ఫ్రెండ్స్ అంత షాక్‌కి గురయ్యామని చెప్పుకొచ్చాడు. కాగా […]
Donald Trump ready to do any help on Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ విమాన క్రాస్ ఒక భయంకరమైన ప్రమాదం అని పేర్కొన్నారు. ఈ సమయంలో భారత్‌కు ఎలాంటి సాయమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో కూలిన బోయింగ్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాద సమయంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. […]
Air India : అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ ఇండియా యాజమాన్యం టాటా గ్రూప్ స్పందించింది. మృతిచెందిన వ్యక్తుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు వెల్లడించింది. క్షతగాత్రులకు వైద్య ఖర్చులను తామే భరిస్తామని తెలిపింది. ఈ మేరకు టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎయిర్ ఇండియా ప్రమాద ఘటన తమను తీవ్రంగా కలచివేసిందని ఆయన తెలిపారు. బాధను వ్యక్తపర్చడానికి మాటలు కూడా రావడం […]
Union Minister Rammohan Naidu : అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రధాని మోదీ ఫోన్ చేసి ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని వివరించారు. అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు జరుగుతోందని, మృతుల సంఖ్య గురించి ఇప్పుడే చెప్పలేమన్నారు. ప్రమాద బాధ్యులను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. విమాన ప్రయాణికుల్లో మాజీ సీఎం […]
Air India Plane Crash : అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. మేఘనినగర్ సమీపంలో ఓ మెడికల్ కళాశాల భవనంపై క్రాష్ అయ్యింది. క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. లండన్ బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానంలో 242 ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 242 మందితో సహా గుజరాత్ మాజీ విజయ్ రూపానీ మృతిచెందారు. మృత్యుంజయుడు.. ఎయిర్ ఇండియా […]
Air India condoles : అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లండన్ బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది. దీంతో ఎయిర్ ఇండియా సంస్థ ‘ఎక్స్’లో అధికారిక ఖాతాలో డీపీ మార్చింది. బాధితులకు సంతాపం తెలుపుతూ నలుపు రంగు డీపీ పెట్టింది. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో లండన్ బయలు దేరిన ఎయిర్ ఇండియా ఏఐ-171 […]