Home / క్రీడలు
ఇండియా ఆస్ట్రేలియా మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు రెండో టీ20 మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా జరుగనుంది. ఈ టోర్నీలో ఇప్పటికే ఆసీస్ చేతిలో ఒక మ్యాచ్ ఓటమితో ఉన్న ఇండియాకు ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. అయితే ఈ మ్యాచ్ కూడా గెలిసి 2-0తో సిరీస్ దక్కించుకోవాలని ఆసిస్ చూస్తుంది.
జింఖానాగ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాల సందర్బంగా ఉద్రిక్త పరిస్థితులపై అజారుద్దీన్‌పై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేసారు.
ఎట్టకేలకు హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ లైన్ టిక్కెట్లు అయిపోయాయని ప్రకటించింది. ఆన్ లైన్ టిక్కెట్లను ఈ రోజు రాత్రి 7గంటల తర్వాత అందుబాటులో ఉంచుతామని నిర్వాహకులు తెలిపారు.
జింఖానా గ్రౌండ్మ లో క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాల సందర్బంగా చోటు చేసుకున్న పరిణామాల పై క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) బాధ్యతా రాహిత్యం వల్లే ఈ సంఘటన జరిగిందని ఆయన విమర్శించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అభిమానులతో ఆటలాడుకొంటుంది. టిక్కెట్ల అమ్మకాల విషయంలో అడ్డదారులు దొక్కుతూ అభిమానులను చిర్రెత్తుకొచ్చేలా చేసింది. తమ ప్లేయర్స్ కొట్టే షాట్ల కోసం గత రెండు రోజులుగా టిక్కెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్ వద్ద అభిమానులు పడిగాపులు కాస్తున్నారు
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా మహిళలు సత్తాచాటారు. దాదాపు 23 ఏళ్ల తర్వాత బ్రిటీష్ గడ్డపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆంగ్లేయులకు చుక్కలు చూపించింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈనెల 25వ తేదీన భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే మూడేళ్ల తర్వాత ఈ మైదానం అంతర్జాతీయ మ్యాచ్‌కి వేదికగా నిలవడం వల్ల టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు పోటెత్తారు. ఈ మ్యాచ్ టికెట్లను గురువారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు అమ్మకాలు జరుపుతామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) పేర్కొనడంతో.. సికింద్రాబాద్‌లోని జిమ్ఖానా మైదానానికి బుధవారం రాత్రి నుంచి భారీ సంఖ్యలో జనాలు క్యూ కట్టారు.
ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. భారీ స్కోర్ చేసినా భారత్ కు ఫలితం దక్కలేదు. కొండంత లక్ష్యం కూడా ఆసీస్ బ్యాటర్ల దూకుడు ముందు కరిగిపోయింది. టాస్ నెగ్గిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది.
బంతిని పాలిష్ చేయడానికి లాలాజలాన్ని ఉపయోగించడం పై నిషేధం అంతర్జాతీయ క్రికెట్లో కోవిడ్ -19 కారణంగా గత రెండు సంవత్సరాలుగా అమలులో ఉంది. ఇపుడు దీనిని శాశ్వతంగా నిషేధిస్తున్నారు.
ఆసియాకప్ పరాభవం తర్వాత భారత జట్టు మరో టీ20 సిరీస్ కు సిద్దం అయ్యింది. ఆస్ట్రేలియాతో నేటి నుంచి మూడు మ్యాచ్‌లకు తెర లేవనుంది. మొహాలీ వేదికగా రాత్రి ఏడుగంటలకు తొలి మ్యాచ్ జరుగనుంది.