Last Updated:

Naveen ul haq: ఆర్సీబీ ఓటమి వేళ.. నవీనుల్‌ హక్‌ ఇన్‌ స్టా స్టోరీ వైరల్!

Naveen ul haq: గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో విరాట్ సెంచరీ సాధించినా.. మ్యాచ్ ను గెలిపించలేకపోయాడు.

Naveen ul haq: ఆర్సీబీ ఓటమి వేళ.. నవీనుల్‌ హక్‌ ఇన్‌ స్టా స్టోరీ వైరల్!

Naveen ul haq: గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో విరాట్ సెంచరీ సాధించినా.. మ్యాచ్ ను గెలిపించలేకపోయాడు. అయితే బెంగళూరు ఓటమి వేళ.. లక్నో ఆటగాడు నవీనుల్ హక్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇన్ స్టా పోస్ట్ వైరల్..(Naveen ul haq)

గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో విరాట్ సెంచరీ సాధించినా.. మ్యాచ్ ను గెలిపించలేకపోయాడు.

అయితే బెంగళూరు ఓటమి వేళ.. లక్నో ఆటగాడు నవీనుల్ హక్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హోం గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు ఓటమిపాలైంది. గుజరాత్ యువ బ్యాటర్.. శుభ్‌మన్‌ గిల్‌ కూడా శతకం బాది ఆర్సీబీ ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు.

దీంతో బెంగళూరు ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్ ఆటగాడు నవీనుల్‌ హక్‌ షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ వైరల్‌గా మారింది.

మే 9న ముంబయితో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ త్వరగా పెవిలియన్‌కు చేరాడు. ఆ సంఘటనపై నవీనుల్‌ హక్‌ ‘స్వీట్ మ్యాంగోస్’అంటూ పోస్టు చేశాడు.

ఇప్పుడు తాజా ఓటమిపై కూడా.. ఇన్ స్టా లో స్టోరీ వైరల్ అవుతుంది. గతంలో జరిగిన ఓ మ్యాచ్ లో విరాట్, నవీనుల్ హక్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

అప్పటి నుంచి బెంగళూరు మ్యాచ్‌లకు సంబంధించి మరీ ముఖ్యంగా విరాట్‌ను ఉద్దేశించి నవీనుల్‌ హక్‌ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నాడు.

దీంతో కోహ్లీ అభిమానులు తీవ్రంగా స్పందించారు.

నవీనుల్ హక్‌ తన పరిధులను అతిక్రమించి.. పోస్టులు పెడుతున్నాడని కోహ్లీ అభిమానులు అంటున్నారు.

ఇలానే చేస్తే అతడికి ఇదే చివరి ఐపీఎల్ అని కోహ్లీ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు.

నిరాశలో ఆర్సీబీ..

ఈ సీజన్ లో మరోసారి బెంగళూరు ఆశలు అడియాశలయ్యాయి. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో.. ఆ జట్టుకు నిరాశ తప్పలేదు.

గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో.. ఆర్సీబీ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన గిల్.. బెంగళూరు ఆశలపై నీల్లు చల్లేశాడు.

ప్రతి సీజన్ లో ఐపీఎల్ కప్ ను ముద్దాడాలని భావించిన ఆర్సీబీకి ఈ సారి మరో భంగపాటు తప్పలేదు.

ఆదివారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్.. బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లి శతకం వృథా అయింది. కోహ్లి (101 నాటౌట్‌; 61 బంతుల్లో 13×4, 1×6) శతకంతో మొదట ఆర్సీబీ 5 వికెట్లకు 197 పరుగులు చేసింది.

గిల్‌తో పాటు విజయ్‌ శంకర్‌ (53; 35 బంతుల్లో 7×4, 2×6) మెరవడంతో లక్ష్యాన్ని టైటాన్స్‌ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.