Last Updated:

Icc Team Rankings: ఊరించి ఉసూరుమనిపించిన ఐసీసీ.. టీమ్ ఇండియా నెం. 1 కాదా?

ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. టెస్టుల్లో మెుదటి స్థానంతో.. మూడు ఫార్మాట్లలోనూ భారత్ అగ్రస్థానంలో నిలిచింది. బుధవారం ఐసీపీ ప్రకటించిన ర్యాంకుల సారాంశం.

Icc Team Rankings: ఊరించి ఉసూరుమనిపించిన ఐసీసీ.. టీమ్ ఇండియా నెం. 1 కాదా?

Icc Team Rankings: ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. టెస్టుల్లో మెుదటి స్థానంతో.. మూడు ఫార్మాట్లలోనూ భారత్ అగ్రస్థానంలో నిలిచింది. బుధవారం ఐసీపీ ప్రకటించిన ర్యాంకుల సారాంశం.

అన్ని ఫార్మాట్ లో భారత్ టాప్ లో ఉందనుకుని సంతోషం వ్యక్తం చేశారు క్రికెట్ అభిమానులు. కానీ ఈ సంతోషం నాలుగు గంటల్లోనే ఆవిరైంది.

ఎందుకుంటే ఐసీసీ చేసిన టెక్నికల్ ఎర్రర్ కారణంగా టెస్టు ర్యాకింగ్స్ లో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి ఇండియాలో టాప్ కి చేరింది.

టెక్నికల్ ఎర్రర్ కారణంగా(Icc Team Rankings)

ఆసిస్ పై తొలి టెస్టు విజయం అనంతరం భారత్ అగ్రస్థానంలో నిలిచిందని ఐసీసీ తన వెబ్ సైట్ లో పెట్టింది. అయితే తప్పు తెలుసుకున్న ఐసీసీ బుధవారం రాత్రి ర్యాంకింగ్స్ ను సవరించింది.

దీంతో 126 రేటింగ్ తో ఆస్ట్రేలియా, 115 రేటింగ్ తో భారత్ వరుసగా మొదటి, రెండు ప్లేసుల్లో ఉన్నాయి.

ఒక వేళ శుక్రవారం నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్టులో కూడా రోహిత్ సేన విజయం సాధిస్తే అప్పుడు టెస్టుల్లోనూ టాప్ కు చేరుకుంటుంది.

ఈ విషయంపై ఐసీసీ వివరణ ఇచ్చింది. సాంకేతిక సమస్య కారణంగా రేటింగ్ పాయింట్లలో పట్టికలో తప్పిదం జరిగిందని తెలిపింది.

అశ్విన్‌ రెండో ర్యాంకుకు

కాగా టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత్ వెటరన్ స్పిన్నర్‌ అశ్విన్‌ రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. మోకాలి శస్త్రచికిత్స నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చి సత్తాచాటిన జడేజా బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 16 వ స్థానంలో ఉన్నాడు. ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌ టాప్ లో ఉన్నాడు.

తొలి టెస్టులో శతకం చేసిన రోహిత్‌ శర్మ బ్యాటర్ల జాబితాలో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఎనిమిదో ర్యాంకు దక్కించుకున్నాడు.

రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆటకు దూరమైన పంత్‌ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అక్షర్‌ 6 స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలోకి వచ్చాడు.

జడేజా (1), అశ్విన్‌ (2) ర్యాంకింగ్స్‌లో మార్పు లేదు.

పుజారాకు వందో టెస్టు మ్యాచ్

అభిమానులు ‘నయా వాల్’గా పిలిచే పూజారా తన కెరీర్ లో వందో టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాడు.

బోర్డర్-గవాస్కర్  ట్రోఫిలో భాగంగా శుక్రవారం ఢిల్లలో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ పుజారాకు వందో టెస్టు. కెరీర్ లో వందో టెస్టు ఆడుతున్న 13 వ ఇండియన్ ప్లేయర్ గా పూజారా నిలుస్తాడు.

ప్రస్తుతం జట్టులో ఉన్న ప్లేయర్స్ లో వందో టెస్ట్ ఆడుతున్ను రెండో ప్లేయర్ పుజారా.

ఇంతకు ముందు విరాట్ కోహ్లీ శ్రీలంకతో వందో టెస్ట్ ఆడాడు. డిఫెన్స్ ఆడటంలో ,స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో పుజారాది ప్రత్యేక శైలి.