Last Updated:

Ind Vs Aus Test: మెుదటి టెస్టులో ఆస్ట్రేలియా చిత్తు.. మూడు రోజుల్లోనే ముగిసిన ఆట

Ind Vs Aus 1st Test: Ind Vs Aus 1st Test: బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో టీమిండియాకు శుభారంభం లభించింది. నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి టేస్టులో ఆస్ట్రేలియాను ఇన్సింగ్స్ 132 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ విజయంతో.. భారత్ టెస్టు సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. స్పిన్నర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు చేతులెత్తేయడంతో మూడు రోజుల్లోనే ఆట ముగిసింది.

Ind Vs Aus Test: మెుదటి టెస్టులో ఆస్ట్రేలియా చిత్తు.. మూడు రోజుల్లోనే ముగిసిన ఆట

Ind Vs Aus Test: బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో టీమిండియాకు శుభారంభం లభించింది. నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి టేస్టులో ఆస్ట్రేలియాను ఇన్సింగ్స్ 132 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ విజయంతో.. భారత్ టెస్టు సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. స్పిన్నర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు చేతులెత్తేయడంతో మూడు రోజుల్లోనే ఆట ముగిసింది.

రెచ్చిపోయిన టీమిండియా స్పిన్నర్లు.. (Ind Vs Aus 1st Test)

మూడో రోజు మ్యాచ్ లో స్పిన్నర్లు రెచ్చిపోయారు. అశ్విన్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు. అశ్విన్ కు తోడుగా.. అక్షర్, జడేజా కూడా బౌలింగ్ లో రాణించడంతో.. రెండో ఇన్సింగ్స్ లో ఆస్ట్రేలియా కేవలం 91 పరుగులక్ ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 132 పరుగలు ఇన్నింగ్స్ తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో మెుదట టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇక తొలి ఇన్సింగ్స్ లో ఆసీస్ 177 పరుగలకు ఆలౌట్ అయింది. మెుదటి ఇన్సింగ్స్ లో స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ విశ్వరూపం ప్రదర్శించారు.

టీమిండియాకు భారీ ఆధిక్యం..

తొలి ఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోర్ సాధించింది. తొలిరోజు పట్టుదలతో బ్యాటింగ్ కొనసాగించిన భారత్.. రెండో రోజు ఆధిక్యం సంపాదించింది. రెండో రోజు మెుదట్లో తడబడిన భారత్.. రోహిత్ శర్మ  సెంచరీతో పటిష్ట స్థితిలో నిలించింది. అనంతరం అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా పట్టుదలతో బ్యాటింగ్ చేసి మంచి ఆధిక్యాన్ని సంపాదించి పెట్టారు. ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ పూర్తిగా విఫలం అయ్యాడు. ఈ దశలో జడేజాకు అక్షర్‌ పటేల్‌ జతయ్యాడు. క్రీజులో ఉన్న ఇద్దరు స్పిన్నర్లే కావడంతో అవలీలగా బ్యాటింగ్ కొనసాగించారు. దీంతో భారత్ 400 పరుగుల మైలురాయిని చేరుకోగలిగింది.

రెండో ఇన్నింగ్స్ లో కుప్పకూలిన ఆసీస్..

రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. స్పిన్నర్ల ధాటికి బెంబేలెత్తిపోయారు. స్పిన్ మాయజాలంతో అశ్విన్ ఐదు వికెట్లు తీయగా.. అతనికి తోడుగా అక్షర్, జడేజా తమ వంతు పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లతో రాణించాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో స్టీవ్ స్మిత్ ఒక్కడే 25 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాట్స్ మెన్స్ వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ఇక భారత బౌలింగ్ అశ్విన్ 5 వికెట్లు తీయగా.. షమి, రవీంద్ర చెరో రెండు వికెట్లు తీశారు.