Paga Paga Paga Movie Review: మ్యూజిక్ డైరెక్టర్ కోటీ “పగ పగ పగ”.. రొటీన్కు భిన్నంగా మూవీ.. రివ్యూ ఏంటంటే..?

Cast & Crew

  • అభిలాష్ (Hero)
  • దీపిక ఆరాధ్య (Heroine)
  • అభిలాష్‌ సుంకర, దీపిక ఆరాధ్య, కోటి, బెనర్జీ (Cast)
  • రవి శ్రీ దుర్గా ప్రసాద్ (Director)
  • సత్య నారాయణ సుంకర (Producer)
  • కోటి (Music)
  • నవీన్ కుమార్ చల్లా (Cinematography)
3

Paga Paga Paga Movie Review: బెజ్జోని పేటలో ఒక్కసారి డీల్ కుదిరితే చచ్చినా పని చేసి చస్తారు అనే పాయింట్ ఆధారంగా సినిమా కథ సాగుతుంది. జగ్గూ (కోటి), కృష్ణ (బెనర్జీ) సెటిల్మెంట్ చేస్తూ హత్యలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ పోలీస్‌ను చంపిన కేసులో కృష్ణ అరెస్ట్ అవుతాడు. అదే సమయంలో జగ్గూకి కూతురు సిరి (దీపిక ఆరాధ్య) జన్మిస్తుంది. అరెస్ట్ అయిన కృష్ణ కుటుంబానికి అండగా ఉంటానని ఇచ్చిన మాటను మరిచిపోతాడు జగ్గూ. ఆ తర్వాత కాలంలో జగ్గూ కాస్త జగదీష్ ప్రసాద్ గా బాగా ఎదుగుతాడు. మరోవైపు కృష్ణ ఫ్యామిలీ కష్టాలు పడుతూనే ఉంటుంది. తమ కుటుంబాన్ని కష్టాలను గట్టెంక్కించాలని కృష్ణ కొడుకు అభి (అభిలాష్) కష్టపడి చదువుతుంటాడు. చిన్నతనం నుంచే అభిని  జగ్గూ కూతురు సిరి ఇష్టపడుతుంది. కానీ ఈ విషయం జగదీష్ ప్రసాద్‌కు నచ్చదు. కోపంతో తన అల్లుడిని చంపేందుకు ఓ డీల్ మాట్లాడతాడు.. కానీ తెల్లారేసరికి మనసు మార్చుకుంటాడు. అయితే అంతలోపే అల్లుడిని చంపే డీల్ కాస్తా..  బెజ్జోని పేట వ్యక్తికి చేరుతుంది.. ఆ తర్వాత ఏమైంది.. అల్లుడిని కాపాడుకోడానికి జగ్గూ ఏం చేస్తాడనేది అసలు కథ. మరి ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో చూసేద్దామా…

1000 సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన కోటి.. తొలిసారి ఈ సినిమాతో నటుడిగా వెండితెరపై కనిపిస్తాడు. ఈ మూవీలో కోటి… తన నటనతో ఆకట్టుకున్నాడు. పైగా  విలన్‌గా అదరగొట్టేశాడనుకోండి. హీరోగా మొదటి సినిమానే అయినా అభిలాష్ తన నటనతో  ప్రేక్షలను మెప్పిస్తాడు. ఇంక ఈ సినిమాలో సీనియర్ నటుడు బెనర్జీ, కరాటే కళ్యాణి, జీవా కీ రోల్స్ పోషించారు.

ఈ మధ్య చాలా సినిమాలు 80ల నేఫథ్యంలోనే తీస్తున్నారు. తాజాగా రవి శ్రీ దుర్గా ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన పగ పగ పగ చిత్రం కూడా ఈ నేపథ్యంలోనే సాగింది. పాయింట్ పాతదే అయినా ట్రీట్ మెంట్ మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తుంది. రొటీన్ కమర్షియల్ కోణంలోనే సాగే ఈ సినిమాకు దర్శకుడు ఎంచుకున్న నేపథ్యమే కొత్తగా అనిపించింది. ద్వితీయార్థంలో కిల్లర్‌ను పట్టుకునేందుకు చేసే ప్రయత్నాలు ఉత్కంఠగా ప్రేక్షకులను ఆధ్యంతం ఆకట్టుకుంటాయి. ఇక చివర్లో క్లైమాక్స్ కూడా అందిరినీ ఆశ్చర్యపరుస్తుంది.

ఇదీ చదవండి: Krishna Vrinda Vihari Movie Review: తెరపై కృష్ణ వ్రింద విహారిపై మ్యాజిక్… ఓవరాల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అంటూ రివ్యూ..!