Last Updated:

Mid day meals: మధ్యాహ్నం భోజనంలో పాము.. 100 మంది పిల్లలు ఆస్పత్రి పాలు

ఓ పాఠశాల మధ్యాహ్నం భోజనంలో ఏకంగా పాము కనిపించింది. అప్పటికే భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బిహార్‌లోని అరారియాలోని స్థానికి పాఠశాలలో జరిగింది. మధ్యాహ్న భోజనంలో పాము కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది.

Mid day meals: మధ్యాహ్నం భోజనంలో పాము.. 100 మంది పిల్లలు ఆస్పత్రి పాలు

Mid day meals: ఓ పాఠశాల మధ్యాహ్నం భోజనంలో ఏకంగా పాము కనిపించింది. అప్పటికే భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బిహార్‌లోని అరారియాలోని స్థానికి పాఠశాలలో జరిగింది. మధ్యాహ్న భోజనంలో పాము కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది.

 

వడ్డించిన ప్లేట్‌లో చనిపోయిన పాము (Mid day meals)

స్థానిక పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో భాగంగా పిల్లలందరికీ కిచిడీ వడ్డించారు. ఈ క్రమంలో ఓ అబ్బాయికి వడ్డించిన ప్లేట్‌లో చనిపోయిన పాము పిల్ల కనిపించింది. ఈ విషయం సిబ్బందికి చెప్పడం భోజనాన్ని పెట్టడం ఆపేశారు. అయితే అప్పటికే చాలామంది పిల్లలు ఆహారం తిన్నారు. కొందరు పిల్లలు వాంతులు చేసుకోవడం మొదలు పెట్టడంతో అప్రమత్తమైన సిబ్బంది.. వారిని హాస్పిటల్ కు తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకన్న పిల్లల తల్లిదండ్రులు స్కూల్ లో ఆందోళన చేపట్టారు. గ్రామస్తులు కొంతమంది స్కూల్ హెడ్ మాస్టర్ పై సైతం దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

 

25 పిల్లల ఆరోగ్యం విషమంగా (Mid day meals)

మిడ్ డే మీల్ లో పాము పడి విద్యార్థులు హాస్పటిల్ పాలైన ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాదాపు 100 మంది విద్యార్థులు ఆహారం తిన్నట్టు గుర్తించారు. వారిలో 25  మంది పిల్లల ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర‍్చినట్టు తెలిపారు. ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం కూడా నిలకడగానే ఉన్నట్టు వెల్లడించారు.

అయతే మధ్యాహ్నం భోజనం పాఠశాల బయట వండి ఓ సప్లయర్ తీసుకువస్తాడని.. స్కూల్ యాజమాన్యం తప‍్పిదం ఏమీ లేదని స్థానిక నాయకులు చెబుతున్నారు. కాగా, మధ్యాహ్న భోజనం విషయంలో ఇలాంటి ఘటనలు జరగడం మొదటి సారి కాదు. ఇదే నెలలో రాష్ట్రంలో ఛప్రాలోని ఓ పాఠశాల మధ్యాహ్న భోజనంలో బల్లి కనిపించింది. ఆ ఘటన మరిచిపోకముందే మళ్లీ మిడ్ డే మీల్ లో పాము కనిపించడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.