Bengaluru: బెంగళూరులో షాపుల ముందు ఇంగ్లీషు నేమ్ ప్లేట్స్ తొలగించిన కన్నడ రక్షణ వేదిక కార్యకర్తలు
కర్ణాటక రక్షణ వేదికకు చెందిన కన్నడ కార్యకర్తలు బెంగళూరు నగరంలో అన్ని సైన్‌బోర్డ్‌లపై '60% కన్నడ' అని డిమాండ్ చేస్తూ చేసిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. .కొందరు కార్యకర్తలు షాపుల ముందు ఇంగ్లిష్ సైన్ బోర్డులను చింపివేయగా, మరికొందరు ఆంగ్ల అక్షరాలపై నల్ల ఇంకు చల్లారు.
Bengaluru: కర్ణాటక రక్షణ వేదికకు చెందిన కన్నడ కార్యకర్తలు బెంగళూరు నగరంలో అన్ని సైన్‌బోర్డ్‌లపై ‘60% కన్నడ’ అని డిమాండ్ చేస్తూ చేసిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. .కొందరు కార్యకర్తలు షాపుల ముందు ఇంగ్లిష్ సైన్ బోర్డులను చింపివేయగా, మరికొందరు ఆంగ్ల అక్షరాలపై నల్ల ఇంకు చల్లారు.
బీబీఎంపీ అల్టిమేటమ్..(Bengaluru)
చాలా మంది నిరసనకారులు, ఎక్కువగా పసుపు మరియు ఎరుపు కండువాలు ధరించి షాపులు, మాల్స్ లోకి ప్రవేశించి ఇంగ్లీష్ సైన్ బోర్డ్స్ చించివేశారు. ఫిబ్రవరి 28లోగా నేమ్‌బోర్డులపై కన్నడ నిబంధనలను 60 శాతం పాటించని దుకాణాలు, హోటళ్లు, మాల్స్‌ల లైసెన్సులను సస్పెండ్ చేస్తామని బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) ప్రకటించిన మరుసటి రోజు ఈ నిరసనలు వెల్లువెత్తాయి.అన్ని హోటళ్లు, మాల్స్ మరియు ఇతర దుకాణాలు తప్పనిసరిగా తమ నేమ్ బోర్డులపై తప్పనిసరిగా కన్నడను ఉపయోగించాలని, నగర పౌర సంఘం ఆదేశించింది, పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. నగరపాలక సంస్ద పరిధిలోని వాణిజ్య దుకాణాలు నిబంధనలు పాటించేందుకు ఫిబ్రవరి 28 వరకు గడువు ఉందని, లేని పక్షంలో వ్యాపార లైసెన్స్‌ల సస్పెన్షన్‌తో సహా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బీబీఎంపీ చీఫ్ తుషార్ గిరి నాథ్ తెలిపారు.
అక్టోబర్‌లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్కరూ కన్నడ మాట్లాడటం నేర్చుకోవాలి అని చెప్పడంతో భాషా వివాదం తెరపైకి వచ్చింది. మనమంతా కన్నడిగులం. వివిధ భాషలు మాట్లాడే ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు (మరియు) ఈ రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ కన్నడ మాట్లాడటం నేర్చుకోవాలని సిద్దరామయ్య అన్నారు. తన మునుపటి పదవీకాలంలో కూడా సిద్ధరామయ్య కన్నడ భాష ఉపయోగించాలంటూ చెప్పారు. అపుడు మెట్రో స్టేషన్లలో హిందీ పేర్లను టేప్ తో కప్పారు.